శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్, సంయుక్త జంటగా తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21 వ తేదీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. బి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ల కలయికలో ఓ కొత్త సినిమా రీసెంట్ గానే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా ఇద్దరు హీరోలు తమ పాన్ ఇండియా సినిమాలు హరిహర వీరమల్లు మరియు విరూపాక్ష చిత్రాలతో బిజీగా ఉన్నారు. మార్చి 1 వ తేదీ విరూపాక్ష మూవీ టీజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ కానుందని సమాచారం. రిపబ్లిక్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాయి తేజ్ విరూపాక్ష మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: