సుకుమార్ దగ్గర శిష్యరికం చేసి మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు. ఇక ఈసినిమా తరువాత ఈసినిమాలో హీరో హీరోయిన్స్ గా చేసిన కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు మాత్రం ఇప్పటివరకూ మరో సినిమాను లైన్ లో పెట్టలేదు. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తర్వాత సినిమా ఉంటుందని, దర్శకుడు చెప్పిన కథ తారక్ కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని కూడా అన్నారు. కానీ అది కూడా కుదరలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజిగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివతో, ప్రశాంత్ నీల్ తో కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాతే బుచ్చి బాబు సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ గ్యాప్ లో బుచ్చి బాబు తన మొదటి హీరో వైష్ణవ్ తో కలిసి మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవి మేకర్స్ నిర్మిస్తారని టాక్. ఈసినిమా కోసం ఇప్పటికే బుచ్చిబాబు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి సినిమాపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: