
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 33


మూడు గెటప్పుల్లో బాలకృష్ణ..!

స్టార్ హీరోయిన్ కావాలని ఆశ - ప్రగ్య జైశ్వాల్

"తలైవి " మూవీ కి సీక్వెల్

చిరంజీవి కి జోడీగా మరోసారి తమన్నా ?

అజిత్ "వాలిమై" మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

'మహా సముద్రం' ట్రైలర్ రిలీజ్

'రిపబ్లిక్'.. అల్లుడు కోసం అతిథిగా మామ..!

హిందీ వెబ్ సిరీస్ లో రెజీనా

శివ కార్తికేయన్ "డాక్టర్ వరుణ్" రిలీజ్ డేట్ ఫిక్స్

లొకేషన్స్ వేటలో "#RAPO 19 "

సిస్టర్ రోల్స్ కు సై - కీర్తి సురేష్

రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్

"లైగర్" మూవీ సెట్స్ లో లయన్

'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్ చేయనున్న చరణ్

సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఆకాశవాణి'

"లవ్ స్టోరీ "సక్సెస్ సెలబ్రేషన్స్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్అయ్యి పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ సక్సెస్ సంతోషాన్ని లవ్ స్టోరి టీమ్ సెలబ్రేట్ చేసుకుంది. అనంతరం మీడియాతో సంతోషాన్ని పంచుకుంది.

'రిపబ్లిక్' పై 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్స్ ప్రశంసలు
సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ముందుగా నిర్ణయించిన తేదీకే సినిమా విడుదల చేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయింది. అందుకే అక్టోబర్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు అంతా సిద్దం చేస్తుంది. అందుకే హీరో సాయి తేజ్ లేకపోయినా ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కడా ఆపకుండా చేస్తున్నారు. ఈనేపథ్యంలో రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు.. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా రానున్నారు.

తొలి బాలీవుడ్ మూవీ రిలీజ్ కై ఎదురుచూస్తున్నా-షాలిని పాండే
సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన షాలిని పాండే , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "మహానటి ", "118 "మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రణ్ వీర్ సింగ్ , షాలిని పాండే జంటగా తెరకెక్కిన "జయేశ్ భాయ్ జోర్దార్" మూవీ విడుదలకుసిద్ధంగా ఉంది. ఈ మూవీ తో షాలిని బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్ డిలే అయ్యింది.

మూడు గెటప్పుల్లో బాలకృష్ణ..!
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న మూడో సినిమా అఖండ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడ్డారు మేకర్స్. ఇప్పటివరకూ టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకోగా ప్రస్తుతం గోవాలో పాటల చిత్రీకరణలో ఉన్నారు. ఇక ఈషెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవనున్నట్టు తెలుస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ కావాలని ఆశ - ప్రగ్య జైశ్వాల్
తెలుగు ,తమిళ భాషల “విరాట్టు “మూవీ తో మోడల్ ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ , కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు. ఎన్ని మూవీస్ లో నటించినా ప్రగ్య స్టార్ డమ్ అందుకోలేకపోయారు.

"తలైవి " మూవీ కి సీక్వెల్
విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ ఆయ్యి ప్రేక్షకాదరణ పొందింది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో జయలలితగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ , ఎమ్ జి ఆర్ పాత్రలో అరవింద్ స్వామి , కరుణానిధిగా ప్రకాష్ రాజ్ , జానకి రామచంద్రన్ పాత్రలో మధుబాల,శశికళ పాత్రలో పూర్ణ, జయలలిత మదర్ సంధ్య పాత్రలో భాగ్యశ్రీ నటించారు.

చిరంజీవి కి జోడీగా మరోసారి తమన్నా ?
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం "గాడ్ ఫాదర్"మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్", బాబీ దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా తమిళ సూపర్ హిట్ “వేదాళం" మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్” మూవీ తెరకెక్కనుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ లో చిరంజీవి చెల్లెలు గా మహానటి కీర్తి సురేష్ నటిస్తున్నారు.

'నాయట్టు' తెలుగు రీమేక్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్..!
మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రీమేక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే చాాలా సినిమాలు రీమేక్ అయి రిలీజ్ అవ్వగా.. కొన్ని రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగామలయాళంలో ఈ ఏడాది వచ్చిన నయట్టు సినిమా మంచి సూపర్ హిట్ అవ్వగా ఇక ఈసినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్న సంగతి కూడా విదితమే..

అజిత్ "వాలిమై" మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ "వాలిమై" మూవీ 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన "వాలిమై" మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా "వాలిమై" ఫస్ట్ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

"లవ్ స్టోరీ "మూవీ పై ప్రభాస్ స్పందన
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. “లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.

'మహా సముద్రం' ట్రైలర్ రిలీజ్
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం'. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు, టీజర్ రిలీజ్ చేయగా ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్ యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇక సముద్రం చాలా గొప్పది..చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది అంటూ శర్వానంద్ ఎంట్రీ.. ‘‘ఇక్కడ మనకి నచ్చినట్టు బతకాలంటే.. మన జాతకాల్ని దేవుడు మందుకొట్టి రాసుండాలి’’ అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్.. ‘‘మీరు చేస్తే నీతి.. నేను…

'రిపబ్లిక్'.. అల్లుడు కోసం అతిథిగా మామ..!
సాయి తేజ్, దేవ కట్టా కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. మరో వారం రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. నిజానికి సాయి తేజ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలులేకపోయినా మేకర్స్ మాత్రం ఆలోటు లేకుండా వారే బాధ్యత తీసుకొని ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా నుండి మెగాస్టార్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

హిందీ వెబ్ సిరీస్ లో రెజీనా
సూపర్ హిట్ "ఫ్యామిలీ మ్యాన్" వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా ఒక హిందీ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, అందాల రాశీఖన్నా , జాతీయ అవార్డ్ గ్రహీత అమోల్ పాలేకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోవా, ముంబైలోని పలు ప్రాంతాల్లో అమోల్ పాలేకర్ పై వచ్చే సన్నివేశాలను దర్శకులు చిత్రీకరించారు.

శివ కార్తికేయన్ "డాక్టర్ వరుణ్" రిలీజ్ డేట్ ఫిక్స్
శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్, కె జె ఆర్ స్టూడియోస్ బ్యానర్స్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో శివ కార్తికేయన్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా తెరకెక్కిన "డాక్టర్" తమిళ మూవీ , కే.జె. ఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రూపొందిన తెలుగు డబ్బింగ్ వెర్షన్"డాక్టర్ వరుణ్" విజయ దశమి కానుకగా అక్టోబర్ 9వ తేదీన రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో వినయ్ రాయ్ విలన్‌గా నటించారు.అనిరుధ్ సంగీతం అందించారు.

లొకేషన్స్ వేటలో "#RAPO 19 "
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

సిస్టర్ రోల్స్ కు సై - కీర్తి సురేష్
తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “భోళా శంకర్ ” “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి ఇప్పుడు ఒక త్రి భాషాచిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాజ్ తరుణ్.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత చాలా సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు విజయాలు అందించినా చాలా సినిమాలు పరాజయాన్నే అందించాయి. ఇక గత కొంతకాలంగా సరైన హిట్ లేని రాజ్ తరుణ్ ఈ సారి ఎలాగైన మంచి సక్సెస్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఈసారి డిఫరెంట్ కథలతో వస్తున్నాడు. అందులో ఒకటి అనుభవించు రాజా సినిమా ఒకటి.

"లైగర్" మూవీ సెట్స్ లో లయన్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్ దేవరకొండ శిక్షణ తీసుకున్నారు.

'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్ చేయనున్న చరణ్
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు "మూవీ ఫేమ్ శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనుభవించు రాజా. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తికావస్తుండగా మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈసినిమా నుండి రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఆకాశవాణి'
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా ఆకాశవాణి. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా వాటిని బట్టి ఈసినిమా ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక ప్రముఖ ఓటీటీ ‘సోనీ లివ్’లో ఈ సెప్టెంబర్ 24వ తేదీన ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈసినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. నేడు ఈసినిమా సెన్సార్ ను పూర్తి చేసుకోగా సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ…