శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి కథానాయిక. ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. “#RAPO19” ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ కృతిశెట్టి బర్త్ డే సందర్భంగా “#RAPO 19 “మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందంగా ఉన్న కృతిశెట్టి పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ కై మేకర్స్ వేటలో ఉన్నారు. లొకేషన్స్ వెతుకుతున్న వీడియో ను మేకర్స్ రిలీజ్ చేశారు. లొకేషన్ సెట్ అవ్వగానే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: