పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్ దేవరకొండ శిక్షణ తీసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న”లైగర్”మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో హీరో బాలకృష్ణ “లైగర్” మూవీ సెట్స్ కు సడెన్‌గా విజిట్ చేసి టీమ్ ను సర్ ప్రైజ్ చేశారు. అందరూ సరదాగా మాట్లాడి ఫోటోలకు ఫోజులిచ్చారు. హీరో బాలకృష్ణ , పూరి జగన్నాథ్ ,ఛార్మి లతో తాను ఉన్న ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేసి జై బాలయ్య అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.
బోయపాటి , బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: