శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్, కె జె ఆర్ స్టూడియోస్ బ్యానర్స్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో శివ కార్తికేయన్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా తెరకెక్కిన “డాక్టర్” తమిళ మూవీ , కే.జె. ఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రూపొందిన తెలుగు డబ్బింగ్ వెర్షన్”డాక్టర్ వరుణ్” విజయ దశమి కానుకగా అక్టోబర్ 9వ తేదీన రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో వినయ్ రాయ్ విలన్‌గా నటించారు.అనిరుధ్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కె జె ఆర్ స్టూడియోస్ అధినేత కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ.. మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారనీ , హీరో శివకార్తికేయన్‌తో ఇదివరకు మేము తీసిన “శక్తి”అనే చిత్రం మంచి హిట్ అయ్యి మాకు లాభాల పంట పండించిందనీ , ఈ చిత్రం కూడా అలాగే సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నామనీ , ప్రేక్షకుల అంచనాలని మించి ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. శివకార్తికేయన్ , అనిరుధ్ కాంబినేషన్‌లో అందరినీ ఎంటర్‌టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుందనీ , డాక్టర్ వరుణ్‌గా శివ కార్తికేయన్ నవరసాలు చూపించారనీ , అన్ని వర్గాల ప్రేక్షకులని నూటికి నూరు శాతం అలరిస్తుందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: