సాయి తేజ్, దేవ కట్టా కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. మరో వారం రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. నిజానికి సాయి తేజ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలులేకపోయినా మేకర్స్ మాత్రం ఆలోటు లేకుండా వారే బాధ్యత తీసుకొని ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా నుండి మెగాస్టార్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి మరో సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. అదేంటంటే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా పవన్ వీడియో పోస్ట్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా.. రమ్యకృష్ణ, జగపతి బాబు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలకానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈసినిమాను జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
Thank you Shri. @PawanKalyan Garu for accepting our humble request to grace the Pre-release event of #Republic as the chief guest 🙏#PawanKalyanForSDT#RepublicOnOct1st @IamSaiDharamTej @aishu_dil @devakatta #ManiSharma @bkrsatish @JBEnt_Offl @ZeeStudios_ @mynnasukumar pic.twitter.com/3hnL1O2G8i
— dev katta (@devakatta) September 23, 2021
ఇకఇదిలా ఉండగా రిపబ్లిక్‌తో పాటు సాయి తేజ్ మరో సినిమాను చేస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు సాయి తేజ్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లేతో వస్తున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: