సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన షాలిని పాండే , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “మహానటి “, “118 “మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రణ్ వీర్ సింగ్ , షాలిని పాండే జంటగా తెరకెక్కిన “జయేశ్ భాయ్ జోర్దార్” మూవీ విడుదలకుసిద్ధంగా ఉంది. ఈ మూవీ తో షాలిని బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్ డిలే అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన తొలి హిందీ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా..? అని ఏడాది కాలానికిపైగా ఎదురుచూస్తున్న షాలిని పాండే. మాట్లాడుతూ..సినిమా విడుదల కోసం ఏడాదికిపైగా ఎదురుచూస్తున్నాననీ , థియేటర్లలో ప్రేక్షకులు తన సినిమాను ఎప్పుడు చూస్తారా అని వెయిట్ చేస్తున్నాననీ , . ఇది చాలా మంచి సినిమా. అంతేకాదు చాలా ప్రత్యేకమైన సినిమా కూడా. ఎంతో ప్రేమ, శ్రద్దతో చేసిన చిత్రమిదనీ , . ప్రేక్షకులు ఈ సినిమాను ఇష్టపడతారనీ , .సినిమా విడుదల గురించి ఆలోచించినపుడల్లా చాలా ఎక్జయిటింగ్ కు లోనవుతున్నాననీ , యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో మూడు సినిమాలలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాననీ , ఇంత త్వరగా ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందని ఊహించలేదనీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: