
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 31


సెన్సార్ పూర్తి చేసుకున్న 'కొండపొలం'

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' ట్రైలర్ రిలీజ్

డిన్నర్ &ఖవ్వాలి ఎంజాయ్ చేసిన తమన్నా

"లవ్ స్టోరి"టీమ్ కు నాగచైతన్య థ్యాంక్స్

'ఇదే మా కథ' ట్రైలర్ రిలీజ్

"నాన్నకు ప్రేమతో"మూవీ బెంగాలీ రీమేక్ "బాజి"

స్ట్రాంగ్ మెసేజ్ తో వంశీ పైడిపల్లి - విజయ్

'రాధేశ్యామ్' రిలీజ్ పై మరోసారి క్లారిటీ

ప్రభుదేవా కొత్త మూవీ ప్రారంభం

మరో బిగ్ ఛాన్స్ కొట్టేసిన 'థమన్'

"పుష్ప "మూవీ పై రష్మిక స్పందన

'మానాడు' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

త్వరలో "విక్రమార్కుడు"మూవీ సీక్వెల్

తనయుడిపై నాగ్ ప్రశంసలు-నవ్వించావు.. ఏడ్పించావు

హీరో నాని పై షాహిద్ కపూర్ ప్రశంసలు

'పుష్పక విమానం' రిలీజ్ డేట్ ఫిక్స్

వర్షంలో సమంత సైకిల్ రైడ్

చిరంజీవి తో స్పెషల్ సాంగ్ కైనా రెడీ - సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. .టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ" మూవీ ఘనవిజయం సాధించింది. సాయి పల్లవి కథానాయికగా రూపొందిన ”విరాటపర్వం “, “శ్యామ్ సింగ రాయ్ “ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'కొండపొలం'
‘ఉప్పెన’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు తను నటిస్తున్న మరో చిత్రం ‘కొండపొలం’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అడవి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథతో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఈ ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

'కొండపొలం'.. శ్వాసలో లిరికల్ వీడియో రిలీజ్
టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం కొండపొలం. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ ఈసినిమాను తెరకెక్కించాడు. ఇక రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం. మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ట్రైండ్ అవుతూ ఈ సినిమా ట్రైలర్ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 8న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో అటు మెగా అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

విశ్వక్ సేన్ 'ఓ మై కడవులే' రీమేక్ డబ్బింగ్ స్టార్ట్
యంగ్ హీరోలు మాత్రం ఎక్కడా తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతూనే ఉన్నారు. ఆ లిస్ట్ లో విశ్వక్ సేన్ కూడా ఉన్నాడు. ఇటీవలే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఆ వెంటనే వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే మళ్లీ రీస్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. జయ ఫణి…

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' ట్రైలర్ రిలీజ్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. వరుసగా మూడు సినిమాల ఫ్లాప్స్ తరువాత అఖిల్ నుండి వస్తున్నసినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసినిమాపై మొదటినుండి మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. దానికి తోడు ఈసారి అఖిల్ యాక్షన్ ఎలిమెంట్స్ కు కాస్త దూరంగా ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ తో వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది.

డిన్నర్ &ఖవ్వాలి ఎంజాయ్ చేసిన తమన్నా
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు.తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. హిందీలో వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “F2 “ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

"లవ్ స్టోరి"టీమ్ కు నాగచైతన్య థ్యాంక్స్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హీరో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన “లవ్ స్టోరీ ” సెప్టెంబర్ 24 వ తేదీ భారీ అంచనాలతో , భారీ స్థాయిలో రిలీజ్అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. నాగ చైతన్య మాట్లాడుతూ ..”లవ్ స్టోరి”మూవీ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా రూపొంది ఘనవిజయం సాధించడం సంతోషంగా ఉందనీ , సోషల్ ఇష్యూస్ తో దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించారనీ , టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తో స్క్రీన్ షేర్ చేసుకొనడం ఆనందంగా ఉందనీచెప్పారు.

'ఇదే మా కథ' ట్రైలర్ రిలీజ్
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇదే మా కథ. గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా ఈసినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రాగ ఇప్పుడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

"నాన్నకు ప్రేమతో"మూవీ బెంగాలీ రీమేక్ "బాజి"
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తండ్రీ కొడుకుల ఎమోషన్ నేపథ్యం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "నాన్నకు ప్రేమతో "మూవీ 2016 సంవత్సరం జనవరి 13 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఎన్ ఆర్ ఐ పాత్రలో నటించిన ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పుడు "నాన్నకు ప్రేమతో"మూవీ బెంగాలీ భాషలో రీమేక్ అయ్యింది.

స్ట్రాంగ్ మెసేజ్ తో వంశీ పైడిపల్లి - విజయ్
తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉన్న నటుడు దళపతి విజయ్‌తో వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వంశీ పైడి పల్లి రీసెంట్ సినిమా మహర్షి. ఇందులో రైతుల సమస్యలు, వ్యవసాయం గురించి చెప్పాడు. ఇక ఈసినిమాకు గాను జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. మరోవైపు విజయ్ కూడా దాదాపు ఈమధ్య అన్ని సినిమాలు మెసేజ్ ఒరియెంటెట్ సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కాబట్టి ఎలాంటి సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'రాధేశ్యామ్' రిలీజ్ పై మరోసారి క్లారిటీ
కరోనా తరువాత థియేటర్లు తెరుచుకున్నా ప్రస్తుతానికి చిన్న సినిమాల నుండి ఓ మోస్తరు బడ్జెట్ సినిమాల వరకూ రిలీజ్ అవుతున్నాయి. అయితే పెద్ద సినిమాలు మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్లిపోయాయి. ఇందులో రాధేశ్యామ్ కూడా ఉంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా మళ్లీ వాయిదా పడబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. సినిమా అనుకున్న డేట్‌కే వస్తుందని, ఇతర ప్రభావాలు సినిమా విడుదలపై లేవని…

ప్రభుదేవా కొత్త మూవీ ప్రారంభం
"మౌన రాగం ")1986 ) మూవీ తో డ్యాన్సర్ గా కోలీవుడ్ కు పరిచయం అయిన ప్రభుదేవా పలు సూపర్ హిట్ సాంగ్స్ ను అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కొరియోగ్రాఫర్ గా మారి ప్రభుదేవా పలు సూపర్ హిట్ మూవీస్ కు పనిచేశారు. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పలు అవార్డ్స్ అందుకున్న ప్రభుదేవా "ఇందు "(1994 )తమిళ మూవీ తో కథానాయకుడిగా మారి తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా"తెలుగు మూవీ తో ప్రభుదేవా దర్శకుడిగా మారారు.

మరో బిగ్ ఛాన్స్ కొట్టేసిన 'థమన్'
ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే వెంటనే థమన్ ఎస్ అని చెప్పొచ్చు. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ అందరూ థమన్ నే సెలక్ట్ చేసుకుంటున్నారు. దానికితోడు థమన్ ఇస్తున్న ఆల్బమ్స్ కూడా అదే రేంజ్ లో వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మరీ ముఖ్యంగా అల వైకుంఠపురములో పాటలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవ్వడంతో థమన్ ఇంకా బిజీ అయిపోయాడు. పెద్ద సినిమాలకు అయితే మ్యాగ్జిమమ్ థమన్ నే తీసుకుంటున్నారు. దానితో పాటు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఆఫర్స్ కూడా చాలానే వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో థమన్ ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. వకీల్ సాబ్…

"పుష్ప "మూవీ పై రష్మిక స్పందన
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో అల్లు అర్జున్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ , ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. హీరోయిన్ రష్మిక ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్…

'మానాడు' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
శింబు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను తెలుగులో 'రీవైన్డ్' అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు అలాగే టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈసినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. ఇక దీపావళికే ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి…

త్వరలో "విక్రమార్కుడు"మూవీ సీక్వెల్
శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన "విక్రమార్కుడు " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనుష్క కథానాయిక. కీరవాణి సంగీతం అందించారు. విక్రమ్ రాథోడ్ , అత్తిలి సత్తిబాబు గా ద్విపాత్రాభినయం చేసి రవితేజ ప్రేక్షకులను అలరించారు. అత్తిలి సత్తిబాబు గా రవితేజ కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు "విక్రమార్కుడు " మూవీ సీక్వెల్ తెరకెక్కనుంది.

తనయుడిపై నాగ్ ప్రశంసలు-నవ్వించావు.. ఏడ్పించావు
కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమాల్లో లవ్ స్టోరీసినిమా ఇండస్ట్రీకి కాస్త ఊరటనిచ్చింది అని చెప్పొచ్చు. ఈసినిమా రిజల్ట్ కోసం అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో మంచి హిట్ టాక్ తెచ్చుకొని.. సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. దీంతో ముందు ముందు రిలీజ్ కాబోయే సినిమాలకు మంచి బూస్టప్ ఇచ్చినట్టైంది. ఇక ఈసినిమా మంచి విజయం దక్కించుకోవడంతో సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున కాస్త భావోద్వేగానికి గురయ్యారు.

హీరో నాని పై షాహిద్ కపూర్ ప్రశంసలు
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నాని ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ గీతా ఆర్ట్స్ , దిల్ రాజు ప్రొడక్షన్స్ , సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కథానాయకుడి గా హిందీ రీమేక్ "జెర్సీ" తెరకెక్కుతుంది.

'పుష్పక విమానం' రిలీజ్ డేట్ ఫిక్స్
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. ‘దొరసాని’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించారు. రెండు సినిమాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కె.వి.గుహన్ దర్శకత్వం లో సైకో క్రై మ్ థ్రిల్లర్ నేపథ్యంలో హైవే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమాలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బేనర్‌పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

వర్షంలో సమంత సైకిల్ రైడ్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను కంప్లీట్ చేశారు. “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత తన ఫ్రెండ్స్ తో హాలీడే ట్రిప్ కు గోవా వెళ్ళి ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.