శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా తండ్రీ కొడుకుల ఎమోషన్ నేపథ్యం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “నాన్నకు ప్రేమతో “మూవీ 2016 సంవత్సరం జనవరి 13 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఎన్ ఆర్ ఐ పాత్రలో నటించిన ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పుడు “నాన్నకు ప్రేమతో”మూవీ బెంగాలీ భాషలో రీమేక్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జీట్జ్ ఫిల్మ్ వర్క్స్ , CAG స్టూడియోస్ బ్యానర్స్ పై అన్షుమన్ ప్రత్యుష్ దర్శకత్వంలో స్టార్ హీరో జీత్ , మిమి చక్రవర్తి జంటగా సూపర్ హిట్ “నాన్నకు ప్రేమతో”మూవీ బెంగాలీ రీమేక్ గా తెరకెక్కిన “బాజి” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. “బాజి” మూవీ కి జీత్ గుంగూలీ సంగీతం అందించగా , అన్బు సెల్వన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: