బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. వరుసగా మూడు సినిమాల ఫ్లాప్స్ తరువాత అఖిల్ నుండి వస్తున్నసినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసినిమాపై మొదటినుండి మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. దానికి తోడు ఈసారి అఖిల్ యాక్షన్ ఎలిమెంట్స్ కు కాస్త దూరంగా ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ తో వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“Hope you fall in love to celebrate each other”
The theatrical Trailer of #MostEligibleBachelor is out now!🧡#MEBTrailer ▶️ https://t.co/MRrrV3ZE6v #AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma @GA2Official @adityamusic #MEBOnOct15th pic.twitter.com/9VPYXfm6W1— Geetha Arts (@GeethaArts) September 30, 2021
కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం.. ప్రదీష్ వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అక్టోబర్ 15న ఈసినిమా రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: