
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 22


శృతి హాసన్ ఫెస్టివల్ లుక్

డబల్ ఎనర్జీతో అఖిల్ 'ఏజెంట్'

చివరి దశలో 'RC15' పూణె షెడ్యూల్..!

'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఫిక్స్

'రాజా విక్రమార్క' ట్రైలర్ రిలీజ్

నాని కి జోడీగా సమంత మరోసారి ?

షాలిని పాండే లేటెస్ట్ లుక్

"ఆశ ఎన్‌కౌంటర్"మూవీ ట్రైలర్ రిలీజ్

'నాయట్టు' రీమేక్ మొదలు..!

"అనుభవించు రాజా " మూవీ రిలీజ్ డేట్

TFN@10 మిలియన్స్..!
'పుష్పక విమానం' ట్రైలర్ రిలీజ్

హీరో సూర్య కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీ "జై భీమ్"

వెరైటీ డ్రెస్ లో రాశీఖన్నా

'RT 70' అనౌన్స్ మెంట్ కు ముహూర్తం ఫిక్స్..!

సాయి పల్లవి నా అభిమాన నటి - కేతిక శర్మ

రియల్ డాక్టర్ గా కనిపిస్తా - రకుల్ ప్రీత్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్", అజయ్ దేవగన్ “మేడే”, “థ్యాంక్ గాడ్”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న రెండు ప్రాజెక్ట్స్ కు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

శృతి హాసన్ ఫెస్టివల్ లుక్
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “సలార్”మూవీ కై శృతి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. సీనియర్ హీరోల మూవీస్ లో శృతి ఆఫర్స్ అందుకుంటున్నారు.

డబల్ ఎనర్జీతో అఖిల్ 'ఏజెంట్'
మొత్తానికి అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్ ఇన్నేళ్లకు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తన ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాపై పెట్టుకోగా.. ఈసినిమా ఆ ఆశలను నేరవేర్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయినట్టు తెలుస్తుంది. దీంతో ఇన్నాళ్లూ ఎంతో ఆశగా ఎదురుచూసిన హిట్ దక్కడంతో అఖిల్ కు ఫుల్ ఎనర్జీ వచ్చినట్టైంది.

చివరి దశలో 'RC15' పూణె షెడ్యూల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూణేలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఒకటి రెండు రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తి కానున్నట్టు సమాచారం అందుతుంది. ఇక మొదటి షెడ్యూల్ తరువాత రెండో షెడ్యూల్ ను దీపావళి తరువాత మొదలుపెట్టనున్నారట.

'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఫిక్స్
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. ఇక అన్ని సినిమాల్లాగే ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఎప్పుడో రిలీజ్ కాావాల్సిన ఈ సినిమా ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. నిజానికి గతేడాది ఏప్రిల్లో విడుదల కావాల్సిన సినిమా ఇది.. అప్పుడు కరోనా వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ జూన్ లో కూడా ఈసినిమా రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే ఈసినిమాను ఓటీటీలో విడుదల చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆవార్తలపై మేకర్స్ కూడా స్పందించి ఈసినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

'రాజా విక్రమార్క' ట్రైలర్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో కార్తికేయ మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సాధించాడు. ఇక ఆసినిమా తర్వాత పలు సినిమాలు చేసినా అవి ఆశించినంత స్థాయిలో పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక ప్రస్తుతం కార్తికేయరాజా విక్రమార్క అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఈసినిమా నవంబర్ 12న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక…

నాని కి జోడీగా సమంత మరోసారి ?
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను సమంత కంప్లీట్ చేశారు. “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ద్విభాషా చిత్రానికి స్టార్ హీరోయిన్ సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

షాలిని పాండే లేటెస్ట్ లుక్
సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన షాలిని పాండే , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “మహానటి “, “118 “మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో మూడు సినిమాలకు షాలిని అగ్రిమెంట్ చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై దివ్యాంగ్ తక్కర్ దర్సకత్వంలో రణ్ వీర్ సింగ్ , షాలిని పాండే జంటగా తెరకెక్కిన “జయేశ్ భాయ్ జోర్దార్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ తో షాలిని బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్ డిలే అయ్యింది.

'మంచి రోజులు వచ్చాయి' టీమ్ కు శర్వా బెస్ట్ విషెస్..!
టాలీవుడ్ లో డిఫరెంట్ కామెడీతో తన మార్క్ ను చూపించిన ఈతరం డైరెక్టర్లలో మారుతి కూడా ఒకరు. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడుఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్లు, సాంగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

"ఆశ ఎన్‌కౌంటర్"మూవీ ట్రైలర్ రిలీజ్
అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణ లో ఆనంద్ చంద్ర దర్శకత్వంలో సోనియా ఆకుల , శ్రీకాంత్ అయ్యంగార్ , ప్రవీణ్ రాజ్ ప్రధాన పాత్రలలో తెలంగాణ లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన, ఆపై ఎన్ కౌంటర్ ను ఆధారంగా తెరకెక్కిన "దిశ ఎన్‌కౌంటర్" మూవీ నవంబర్ 26 వ తేదీ రిలీజ్ కానుంది. డి ఎస్ ఆర్ సంగీతం అందించారు. మూవీ టైటిల్ పై అభ్యంతరాలు రావడం తో టైటిల్ ను "ఆశ ఎన్‌కౌంటర్" గా మార్చారు.

'RT70' ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా ఫుల్ ఫామ్ లోకి వచ్చి ఇప్పుడు వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఒకసినిమా తరువాత మరొక సినిమాను లైన్ లో పెట్టడమే కాదు వాటిని అంతే ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నాడు కూడా. క్రాక్ తర్వాత ఏకంగా మూడు సినిమాలు అనౌన్స్ చేసిన రవితేజ.. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇక మూడో సినిమా షూట్ కూడా ఇటీవల స్టార్ట్ చేసేసారు.

'నాయట్టు' రీమేక్ మొదలు..!
టాలీవుడ్ లో ప్రస్తుతం పలు మలయాళ సినిమాలు రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో రీమేక్ సెట్స్ పైకి వచ్చింది. మలయాళంలో ఈ ఏడాది వచ్చిన నాయట్టు సినిమా మంచి సూపర్ హిట్ అవ్వగా ఇక ఈసినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా హక్కులను అల్లు అరవింద్ వారి జీఏ2 పిక్చర్స్ దీని హక్కులను సొంతం చేసుకున్న సంగతి కూడా విదితమే.

"అనుభవించు రాజా " మూవీ రిలీజ్ డేట్
అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్పీ బ్యానర్స్ పై శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ , కషిష్ ఖాన్ జంటగా పేకాట కోడిపందాల నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ "అనుభవించు రాజా " మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. పోసాని , అజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు. పక్కా గోదావరి స్లాంగ్ లో రాజ్ తరుణ్ పలికే డైలాగ్స్, ఆయన గెటప్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయి.

TFN@10 మిలియన్స్..!
ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ చంటిగాడు లోకల్.. ఇడియట్ సినిమాలో పూరీ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా. అలాగే ఎన్నో యూ ట్యూబ్ ఛానల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి కానీ కొన్ని ఛానల్స్ కు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందులో ఒకటే టీఎఫ్ఎన్ అంటే తెలుగు ఫిలింనగర్ యూట్యూబ్ ఛానల్. సినిమా అప్ డేట్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు ఈ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఫిలిం న్యూస్ కు సంబంధించిన ఛానల్స్ చాలానే ఉన్నాయి.. కానీ ఎంత ఒరిజినల్ కంటెంట్ ఇస్తున్నామన్నది ఇంపార్టెంట్. అందులో మొదట వరుసలో ఈ ఛానల్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
'పుష్పక విమానం' ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త సినిమా "పుష్పక విమానం". ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. నవంబర్ 12న ఈసినిమా ప్రేక్షకులముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో నేడు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈసందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

హీరో సూర్య కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీ "జై భీమ్"
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టి జె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన "జై భీమ్" తమిళ మూవీ నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్, రావు రమేష్, రజిష విజయన్, మణికందన్, లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలలో నటించారు. సీన్ రోల్డన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వెరైటీ డ్రెస్ లో రాశీఖన్నా
సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుసలాడే” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో రెండు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

'RT 70' అనౌన్స్ మెంట్ కు ముహూర్తం ఫిక్స్..!
క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన తరువాత మాస్ మహారాజా ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంట వెంటనే లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ మొత్తం దాదాపు పూర్తయింది.. ఇంకో పదిరోజులు షూటింగ్ మిగిలిఉండగా దానిని పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అంతర్వేది లక్ష్మీ నృసింహ స్వామి సన్నిధిలో శర్వా , రష్మిక
ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ , రష్మిక జంటగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్స్ రాధిక , ఖుష్బూ , ఊర్వశి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా “ఆడవాళ్ళు మీకు జోహార్లు “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సాయి పల్లవి నా అభిమాన నటి - కేతిక శర్మ
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఈ మూవీ కి దర్శకుడు పూరి జగన్నాథ్ స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించడం విశేషం.