మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూణేలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఒకటి రెండు రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తి కానున్నట్టు సమాచారం అందుతుంది. ఇక మొదటి షెడ్యూల్ తరువాత రెండో షెడ్యూల్ ను దీపావళి తరువాత మొదలుపెట్టనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మిగతా పాత్రల్లో సునీల్, అంజలి, నవీన్ చంద్ర కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: