2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టి జె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన “జై భీమ్” తమిళ మూవీ నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్, రావు రమేష్, రజిష విజయన్, మణికందన్, లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలలో నటించారు. సీన్ రోల్డన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“జై భీమ్” మూవీ గురించి హీరో సూర్య మాట్లాడుతూ .. 24 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసాననీ , అభిమానులు 24 ఏళ్ల నుంచి తనతో పాటే ప్రయాణం చేస్తున్నారనీ , తనపై ఇంత నమ్మకం ఉంచినందుకు అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలనీ , వారికి కేవలం మంచి సినిమాలు ఇచ్చి వారిని సంతోషంగా ఉంచడం తప్ప తాను చేసిందేం లేదనీ , సినిమా అనేది తనకు , తన అభిమానులకు మధ్య ఇంత గొప్ప బంధాన్ని ఏర్పరిచిందనీ , తన కెరీర్ లో మోస్ట్ ఛాలెంజింగ్ సినిమాలలో “జై భీమ్” ఒకటనీ , లాయర్ చంద్ర పాత్ర చాలెంజింగ్ గా ఉంటుందనీ , . తన గత చిత్రాల కంటే చాలా భిన్నంగా ఉంటుందనీ , కమర్షియల్ అంశాలు పెద్దగా ఉండవనీ , కథలో పాత్రల ఎమోషన్స్ మాత్రమే కనిపిస్తాయనీ , ప్రతీ ఒక్కరినీ కదిలించే చిత్రమిదనీ , తనకు చాలకాలం పాటు గుర్తిండిపోయే సినిమా అనీ , ఈ సినిమా ని ఓ బాధ్యతగా భావించి చేసాననీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























