మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమా ఫుల్ ఫామ్ లోకి వచ్చి ఇప్పుడు వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఒకసినిమా తరువాత మరొక సినిమాను లైన్ లో పెట్టడమే కాదు వాటిని అంతే ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నాడు కూడా. క్రాక్ తర్వాత ఏకంగా మూడు సినిమాలు అనౌన్స్ చేసిన రవితేజ.. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇక మూడో సినిమా షూట్ కూడా ఇటీవల స్టార్ట్ చేసేసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండా ఇప్పుడు తన 70వ సినిమాను కూడా ప్రకటించేశాడు. స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ తన 70వ సినిమాను ప్రకటించాడు. ఈసందర్భంగా అనౌన్స్మెంట్ పోస్టర్ ని రిలీజ్ చేయగా.. పురాతన కట్టడాల్లో, ఆలయాల్లో ఉండే కళాకృతులు, శిల్పాలు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. ఇక పోస్టర్ పై ‘హీరోస్ డోంట్ ఎక్సిస్ట్అనే ట్యాగ్ లైన్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ఇంకా రిలీజ్ డేట్‌ను నవంబర్ 5న 10 గంటల 8 నిమిషాలకు ప్రకటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసేసారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: