
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 16


ట్రెండీ అవుట్ ఫిట్ లో అను ఇమ్మాన్యుయేల్

మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో నివేద థామస్

ఏడాది పూర్తిచేసుకున్న 'మిడిల్ క్లాస్ మెలోడీస్'

"బంగార్రాజు"మూవీ ఫస్ట్ లుక్ , టీజర్ రిలీజ్ డేట్స్

వరుస మూవీస్ తో బిజీగా రవితేజ

పాత్ర నచ్చితేనే ఏదైనా... రష్మిక

నవీన్ చంద్ర-అవికా 'బ్రో' మూవీ ట్రైలర్ రిలీజ్

"అఖండ" మూవీ తో "బింబిసార" మూవీ టీజర్ రిలీజ్

'గౌతమ్' కొత్త సినిమా ప్రారంభం

'రాధేశ్యామ్'.. మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ

హోమ్ ప్రొడక్షన్ లో కీర్తిసురేష్

హైప్ క్రియేట్ చేసిన "శ్యామ్ సింగ రాయ్"టీజర్

సూర్య-పాండిరాజ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

నయన్ మరో హారర్ సినిమా 'కనెక్ట్'

'తరుణ్ భాస్కర్' స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు

'ఎఫ్ 3' థియేటర్లలోనే..ఈసారి ట్రిపుల్ ట్రీట్

వింటేజ్ లుక్ లో నాని
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అఖండ'.. బాలయ్య విశ్వరూపం..!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అఖండ. సింహా, లెజెండ్ సినిమాల తరువాత వస్తున్న మూడో సినిమా కాబట్టి ఈసినిమాతో హ్యాట్రిక్ కొడతారా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ట్రెండీ అవుట్ ఫిట్ లో అను ఇమ్మాన్యుయేల్
“యాక్షన్ హీరో బిజు “మూవీ తో అను ఇమ్మాన్యుయేల్మఅను ఇమ్మాన్యుయేల్లయాళ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. “మజ్ను ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అను “కిట్టు ఉన్నాడు జాగ్రత్త “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “తుప్పరివాలన్ “మూవీ తో అను కోలీవుడ్ లో అడుగు పెట్టారు. యాక్షన్ హీరో గోపీచంద్ “ఆక్సిజన్ “, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి “, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “నా పేరు సూర్య “, నాగచైతన్య “శైలజా రెడ్డి అల్లుడు “, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో అను కథానాయికగా నటించి తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు.

"F3 " మూవీ రిలీజ్ ప్లాన్స్ కన్ ఫర్మ్ చేసిన వెంకటేష్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే కాంబినేషన్ లో “F 3” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో నివేద థామస్
పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన నివేద థామస్ సూపర్ హిట్ “జంటిల్ మన్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నిన్నుకోరి”, “జై లవ కుశ “, “118 “, “బ్రోచేవారెవరురా”, “వకీల్ సాబ్” వంటి సూపర్ హిట్ మూవీస్ లో నివేదా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేదా ప్రస్తుతం “మీట్ క్యూట్ “, “శాకిని డాకిని ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఏడాది పూర్తిచేసుకున్న 'మిడిల్ క్లాస్ మెలోడీస్'
ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. వినోద్ అనంతోజు దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. వెనిగళ్ల ఆనంద ప్రసాద్ ఈసినిమాను నిర్మించగా స్వీకర్ అగస్తి సంగీతం అందించాడు. అయితే ఈసినిమా రిలీజ్ అప్పుడు కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం.. థియేటర్లు లేకపోవడంతో ఓటీటీలోనే ఈసినిమా రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ లో ఈసినిమా రిలీజ్ అయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో. ఎన్ని కాంప్రమైజ్ లు ఉంటాయో.. ఆలోచనలు.. ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలు ఈసినిమాలో చూపించారు.

"బంగార్రాజు"మూవీ ఫస్ట్ లుక్ , టీజర్ రిలీజ్ డేట్స్
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ కై ఎంపిక అయ్యారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

వరుస మూవీస్ తో బిజీగా రవితేజ
బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ తరువాత మాస్ మహారాజా రవితేజ జోరు పెంచారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ తెరకెక్కుతుంది . ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ షూటింగ్ ముగింపు దశ లో…

పాత్ర నచ్చితేనే ఏదైనా... రష్మిక
సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నారు.శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో రష్మిక నటిస్తున్నారు.

నవీన్ చంద్ర-అవికా 'బ్రో' మూవీ ట్రైలర్ రిలీజ్
సాధారణంగా హీరో హీరోయిన్స్ ఇప్పుడున్న కాంపిటీషన్ నేపథ్యంలో ఎలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడానికైనా రెడీ అయిపోతున్నారు. రొటీన్ గా ఉండే పాత్రలకు దూరంగా ఉండి కొత్తగా కనిపించడానికే ట్రై చేస్తున్నారు. అందులో అవికా గోర్, నవీన్ చంద్ర ఇద్దరూ ఇద్దరే. చాలా సెలెక్టెడ్‌గా సినిమాలను చేస్తుంటారు. కథలు, పాత్రలు నచ్చితేనే ప్రాజెక్ట్‌లకు ఓకే చెబుతుంటారు. ఇక దీనిలో భాగంగానే హీరో, హీరోయిన్లుగా చేస్తున్నవాళ్లు అన్నాచెల్లెళ్లుగా చేయాలంటే మాత్రం అంత ఈజీ కాదు. కానీ నవీన్ చంద్ర, అవికా గోర్ అందుకు మినహాయింపుగా బ్రో అనే సినిమాతో వస్తున్నారు. ఈసినిమాలో ఇద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా అన్ని…

"అఖండ" మూవీ తో "బింబిసార" మూవీ టీజర్ రిలీజ్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'గౌతమ్' కొత్త సినిమా ప్రారంభం
బ్రహ్మానందం తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గౌతమ్ మొదట్లో కాస్త సినిమాలు తీసినా తరువాత మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మంచి సక్సెస్ రాకపోవడం కూడా దీనికో కారణం అయి ఉండొచ్చు. అయితే ఆ మధ్య మను అనే డిఫరెంట్ స్టోరీతో వచ్చాడు కానీ అది కూడా కాస్త నిరాశ పరిచింది. దీంతో మళ్లీ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. గౌతమ్ హీరోగా సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. సుబ్బు చెరుకూరి ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

'రాధేశ్యామ్'.. మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమాను సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో ఈసినిమా కూడా రిలీజ్ డేట్ ను మార్చుకుంటుందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి అందరికీ. అయితే ఎప్పటికప్పుడు రాధేశ్యామ్ టీమ్ క్లారిటీ ఇస్తుంది. ఏ అప్ డేట్ ఇచ్చినా కూడా రిలీజ్ డేట్ ను కూడా వాటితో పాటు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా రాధేశ్యామ్ నుండి ఈ రాతలే అన్న పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈపాటకు కూడా మంచి రెస్పాన్స్ రావడమే కాదు యూట్యూబ్ లో ఫుల్ వ్యూస్ తో…

హోమ్ ప్రొడక్షన్ లో కీర్తిసురేష్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ తెలుగు , తమిళ, మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ గా మారారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “సాని కాయిధమ్ “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “, “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి చిరంజీవి “భోళా శంకర్ “, నాని “దసరా “మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

హైప్ క్రియేట్ చేసిన "శ్యామ్ సింగ రాయ్"టీజర్
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సూర్య-పాండిరాజ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం విభిన్నమైన సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. గత ఏడాది ‘ఆకాశం నీహద్దురా’ సినిమాతో అలరించిన తమిళ స్టార్ హీరో సూర్య ఈఏడాది జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన జై భీమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యధార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈరెండు సినిమాలు కూడా సూర్య ని మరో స్థాయికి తీసుకెళ్లాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు సినిమాలకు కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.

నయన్ మరో హారర్ సినిమా 'కనెక్ట్'
లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తొచ్చే హీరోయిన్లలో నయనతార పేరు ముందుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అనేక హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన నయన్.. ఇప్పుడు ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఎక్కువగా చేస్తుంది. ఇక నయనతార ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నెట్రికన్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలానే రజినీకాంత్ సినిమా అన్నాత్తే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నయన్. రెండు సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకుల కాదల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

'తరుణ్ భాస్కర్' స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు
టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న కొత్త డైరెక్టర్లలో తరు ణ్ భాస్కర్ కూడా ఒకడు. మొదటిసినిమా పెళ్లి చూపులు తోనే తన సత్తా చాటాడు. చిన్న సినిమా తీసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇదిలా ఉండగా వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య దీనిపై ఎలాంటి న్యూస్ కానీ క్లారిటీ కానీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై క్లారిటీ వచ్చింది.

ఓటీటీలలో ఉండే అందం అదే- వెంకటేష్
శ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ “దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ "దృశ్యం 2″ మూవీ నవంబర్ 25 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

'ఎఫ్ 3' థియేటర్లలోనే..ఈసారి ట్రిపుల్ ట్రీట్
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా దృశ్యం 2. దృశ్యం సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు ఇంటర్య్వూల్లో పాల్గొంటున్నారు. ఈసందర్భంగా వెంకీని పలు ప్రశ్నలు అడుగగా వాటికి సమాధానమిచ్చారు. దీనిలో భాగంగానే.. నారప్ప, ఇప్పుడు దృశ్యం ఈ రెండు సినిమాలు ఓటీటీకి వెళ్లిపోయాయి మరి ఫ్యాన్స్ కి ఎఫ్ 3 తో గట్టి ట్రీట్ ఇస్తారా అన్న ప్రశ్నకు వెంకీ సమాధానమిస్తూ.. తప్పకుండా.. ఈసారి డబుల్ ట్రిపుల్ ట్రీట్ ఖచ్చితంగా నా అభిమానులకు ఉంటుంది. అది కూడా థియేటర్స్ లోనే ఉంటుంది…