పలు సూపర్ హిట్ మలయాళ , తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన నివేద థామస్ సూపర్ హిట్ “జంటిల్ మన్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “నిన్నుకోరి”, “జై లవ కుశ “, “118 “, “బ్రోచేవారెవరురా”, “వకీల్ సాబ్” వంటి సూపర్ హిట్ మూవీస్ లో నివేదా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేదా ప్రస్తుతం “మీట్ క్యూట్ “, “శాకిని డాకిని ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “శాకిని డాకిని ” మూవీ లో పాత్రకై ఒక ప్రొఫెషనల్ కోచ్ సమక్షంలో స్టిక్ ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నివేద స్వతహాగానే క్రీడాకారిణి, అథ్లెటిక్ లుక్ తో కనిపిస్తుంది. అందుకే ఇంత పర్ఫెక్షన్ తో స్టిక్ ఫైట్ కి ప్రిపేరవుతోంది. మొత్తానికి శాకిని డాకినిలో యాక్షన్ క్వీన్ గా నివేద ను చూడబోతున్నాము. పోలీస్ పాత్రలకు అలాగే యాక్షన్ తరహా రోల్స్ కి నివేద పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పుకోవాలి. రామ్ “రెడ్” మూవీ లో లేడీ పోలీస్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: