బ్రహ్మానందం తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గౌతమ్ మొదట్లో కాస్త సినిమాలు తీసినా తరువాత మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మంచి సక్సెస్ రాకపోవడం కూడా దీనికో కారణం అయి ఉండొచ్చు. అయితే ఆ మధ్య మను అనే డిఫరెంట్ స్టోరీతో వచ్చాడు కానీ అది కూడా కాస్త నిరాశ పరిచింది. దీంతో మళ్లీ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. గౌతమ్ హీరోగా సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. సుబ్బు చెరుకూరి ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాను నేడు ప్రారంభించారు. ఈసందర్భంగా దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ మోనోఫోబియాతో బాధపడుతున్న ఓ అప్ కమింగ్ రైటర్ తన జీవితానికి ప్రమాదం ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించి బయటపడ్డాడు అనే కథాంశంతో సరికొత్త అనుభూతి కలిగించేలా ఈ చిత్రం ఉండబోతుందని తెలిపారు. మరి చూద్దాం ఈసినిమాతో గౌతమ్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో.
కాగా ఈసినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ఇక శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: