పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ తెలుగు , తమిళ, మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ గా మారారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “సాని కాయిధమ్ “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “, “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి చిరంజీవి “భోళా శంకర్ “, నాని “దసరా “మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కీర్తి ఫాదర్ సురేష్ మలయాళంలో పేరు మోసిన నిర్మాతే. 80, 90 దశకాల్లో పెద్ద ఎత్తున సినిమాలు నిర్మించారు. ముందు వేరే నిర్మాతతో కలిసి సినిమాలు తీసిన ఆయన, నటి మేనకను వివాహం చేసుకున్న తరువాత రేవతి కళామందిర్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ను ప్రారంభించి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. కెరీర్ ఆరంభంలో కీర్తి ఈ బేనర్లో “పైలట్స్” అనే మూవీ లో నటించారు. కీర్తి సురేష్ స్టార్ అయ్యాక మాత్రం సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయలేదు. ఇప్పుడు కీర్తి స్వంత నిర్మాణ సంస్థ లో విష్ణు రాఘవ్ దర్శకత్వంలో టొవినో థామస్ హీరోగా తెరకెక్కనున్న “వాషి ” మలయాళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: