ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. వినోద్ అనంతోజు దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. వెనిగళ్ల ఆనంద ప్రసాద్ ఈసినిమాను నిర్మించగా స్వీకర్ అగస్తి సంగీతం అందించాడు. అయితే ఈసినిమా రిలీజ్ అప్పుడు కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం.. థియేటర్లు లేకపోవడంతో ఓటీటీలోనే ఈసినిమా రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ లో ఈసినిమా రిలీజ్ అయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో. ఎన్ని కాంప్రమైజ్ లు ఉంటాయో.. ఆలోచనలు.. ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలు ఈసినిమాలో చూపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో నటించిన ఆనంద్ దేవరకొండ, వర్ష బొలమ్మ చాలా న్యాచురల్ గా నటించారు. వీరితో పాటు ఈసినిమాలో నటించిన గోపరాజు రమణ పాత్ర మాత్రం సినిమాకు హైలెట్. తన కోపంతోనే కామెడీని పండించాడు. ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ అయి ఇప్పటికి ఏడాది పూర్తి చేసుకుంది. మరి ఈసినిమా చూడని వాళ్లు మరోసారి చూసి ఎంజాయ్ చేయాలనుకునేవాళ్లు ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి.
1 Year Ago, On this day #AnandDevarakonda and #VarshaBollamma‘s Blockbuster family entertainer #MiddleClassMelodies was released.
Stream Full Movie on @primevideoin : https://t.co/PFFoUY20eB#1YearForMiddleClassMelodies #SweekarAgasti #VinodAnantoju #OnThisDay #TeluguFilmNagar pic.twitter.com/9PYXXM0PBi
— Telugu FilmNagar (@telugufilmnagar) November 20, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: