హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ ఎఫ్2. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఫుల్ ఫన్ అడ్ ఫస్ట్రేషన్ గా తెరకెక్కిన ఈసినిమా టీజర్, ట్రైలర్ లతోనే అంచనాలు పెంచేసింది. సంక్రాంతి అల్లుళ్లు ఈ పండక్కి ఫుల్ నవ్వించనున్నారని అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయిందా…? ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారా లేదా అని తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై.విజయ, నాజర్ తదితరులు
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: దిల్‌రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
కథ:
వెంకీ (వెంకటేష్) ఎమ్మెల్యే రవిబాబు దగ్గర పీఏగా పనిచేస్తుంటాడు. అయితే తాను హారిక (తమన్నా)ను ప్రేమించి పెళ్లాడతాడు. ఇక్కడి వరకూ బాగానే ఉన్న వెంకీ లైఫ్ పెళ్లి తరువాత అనుకోకుండా మారిపోతుంది. పెళ్లి తరువాత తమన్నా, అత్తగారు కలిసి వెంకీని తమ కంట్రోల్ లో పెట్టుకుందామని ట్రై చేస్తుంటారు. దీంతో వెంకీకి ఫ్రస్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా వెంకీ జీవితం సాగుతుండగా.. తమన్నా చెల్లి మెహ్రీన్ ఇంటికి వస్తుంది. మెహ్రీన్ ని చూసి వరుణ్ యాదవ్ (వరుణ్ తేజ్) ప్రేమలో పడతాడు. మెహ్రీన్ ను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అవుతాడు. ఇక ఇది తెలిసిన వెంకీ పెళ్లి వద్దని వరుణ్ కు ఎంత నచ్చజెప్పినా వినకుండా మెహ్రీన్ ను పెళ్లాడతాడు. ఆ తరువాత కొద్ది రోజులకు సేమ్ వరుణ్ కు కూడా ఫ్రస్టేషన్ మొదలవుతుంది. ఇక ఇదంతా చూసి పక్కింట్లో ఉండే రాజేంద్ర ప్రసాద్ మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్లిపోండని, అప్పుడే అక్కాచెల్లెళ్లకు మీ విలువ తెలిసి వస్తుందని, తోడల్లుళ్లకు సలహా ఇస్తాడు. దీంతో ఇద్దరూ యూరప్ వెళ్తారు.
ట్విస్ట్ ఏంటంటే…అదే యూరప్ కు తమన్నా, మెహ్రీన్ కూడా వస్తారు. చక్కగా యూరప్ లో ఎంజాయ్ చేస్తున్న వారికి ఊహించని ట్విస్ట్ ఇస్తారు తమన్నా మెహ్రీన్. ప్రకాష్ రాజ్ కొడుకులు సత్యం రాజేష్, సుబ్బరాజులను 10రోజుల్లోనే పెళ్లాడేందుకు ఆ అక్కచెళ్ళిలిద్దరూ ప్లాన్ చేస్తారు. దాంతో మొగుళ్లకు టార్చర్ మొదలవుతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. అప్పుడు వెంకీ వరుణ్ ఏం చేశారు? తమన్నా, మెహ్రీన్ ల మళ్లీ పెళ్ళి చేసుకోవడం వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? .తమ పెళ్లాళ్లకు బుద్ది చెబుదామని యూరప్ వచ్చిన వెంకీ, వరుణ్ విజయం సాధించారా లేక పెళ్లాలదే పై చేయి అయ్యిందా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
‘పటాస్’, సుప్రీమ్, ‘రాజా ది గ్రేట్’ మూడు హిట్ల తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాతో మరోసారి అనిల్ రావిపూడి సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. సంక్రాంతి బరిలో వచ్చిన నాలుగో సినిమా ఎఫ్ 2 లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చింది అన్నట్టు డీసెంట్ హిట్ కొట్టిందని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి టేకింగ్ ఏంటో! ప్రేక్షకులకు బాగా తెలుసు. కితకితలు పెడుతూనే కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం ఎలాగో ఆయనకు తెలుసు. తన బలం వినోదమే. దాన్ని సాధ్యమైనంతవరకూ ప్రతి సీన్‌లో పండించడానికి ప్రయత్నించాడు. పాత ఫార్ములానే అయినా దానికి కొత్తగా తీసి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్ రాసుకోకుండా షూటింగ్ కు వెళ్లారని దిల్ రాజు చెప్పిన విషయం ఈ సినిమా చూస్తే గుర్తొస్తుంది. అనిల్ మీద ఎంత నమ్మకం లేకపోతే దిల్ రాజు ఒప్పుకుంటారో ఈ సినిమా సక్సెస్ ను బట్టి తెలుస్తోంది.
ఇక కామెడీ చేయడంలో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం అంటే టైమ్ వేస్ట్ పనే. వెంకీ కు ఇలాంటి కామెడీ కొట్టిన పిండితో సమానం కాబట్టి అవలీలగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇక్కడ మెచ్చుకోవాల్సింది వరుణ్ తేజ్ ఫెర్మామెన్స్ గురించి. వెంకీ లాంటి కామెడీ కింగ్ పక్కన తన వంతు తాను చాలా బాగా ట్రై చేశాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ నవ్వించాడు. అయితే ఇద్దరూ కలిసున్నప్పుడు మాత్రం వెంకీని డామినేట్ చేయలేకపోయాడనుకోండి. ఇక పొగరుబోతు భార్యల క్యారెక్టర్లలో తమన్నా, మెహ్రీన్ ఇద్దరూ బాగా నటించారు. మెహ్రీన్ పొగరుగా నటించినా..ఆ సాఫ్ట్ నెస్ అనేది మాత్రం కనిపిస్తూనే ఉంది. రఘుబాబు, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, నాజర్, అన్నపూర్ణ, వై.విజయ, ఇలా వారి వారి పాత్రల మేర నవ్వించడానికి ప్రయత్నించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పర్వాలేదు. కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాని కలర్ ఫుల్ గా తీర్చి దిద్దారు.
ఇక కథ విషయానికొస్తే ఫస్ట్ ఆఫ్ అయితే కడుపు చెక్కలయ్యేలా నవ్వించేశారు. ఎక్కడా గ్యాప్ లేకుండా ఒకదాని తరువాత మరొ కామెడీ సీన్ తో నవ్వించేశారు. అయితే ద్వితియార్దంలో మాత్రం ఆ కామెడీ కాస్త తగ్గింది. అక్కడకక్కడా కాస్త సాగదీత అనిపించినా అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్లైమాక్స్ కి వచ్చే సరికి మాత్రం మళ్లీ బాగా బ్యాలెన్స్ చేశాడు అనిల్. క్లైమాక్స్ కూడా సినిమాకు మరో హైలెట్ అని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్:
వెంకటేష్ కామెడీ
ఫస్టాఫ్
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ లో అక్కడక్కడా సాగదీత
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లుళ్లు చెప్పినట్టే మంచి గా నవ్వించేసి పనిలో పనిగా సక్సెస్ కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. అన్ని వర్గాలవారు చూసి మంచిగా నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా అని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు.
[wp-review id=”13939″]
[youtube_video videoid=ISSJx9e4em0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: