సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌కి కామెడీ టైమింగ్‌లో తిరుగులేదు. ముఖ్యంగా…`ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `నువ్వు నాకు నచ్చావ్`, `మల్లీశ్వరి`లో వెంకీ కామెడీకి ఫిదా కాని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. మళ్ళీ… చాన్నాళ్ళ తరువాత ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌తో వెంకీ సందడి చేయనున్నారు. ఆ చిత్రమే `ఎఫ్ 2`. వరుణ్ తేజ్ మరో హీరోగా నటించిన ఈ సినిమాని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించగా… హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. కాగా… ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లో వెంకీ తన హాస్యనటనతో సినిమాపై అంచనాలు పెంచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర వర్గాల సమాచారం ప్రకారం… ఓ సీన్‌లో వెంకీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించబోతున్నారని తెలుస్తోంది. ఫస్టాఫ్‌లో ఓ కీలక సన్నివేశంలో వచ్చే `డాగ్ ఎపిసోడ్`… సినిమాలో ఓ మేజర్ హైలైట్‌గా నిలవడమే కాకుండా… చాలా కాలం గుర్తుండిపోతుందట. మరి… ఆ `డాగ్ ఎపిసోడ్` ఎలా ఉండబోతుందో తెలియాలంటే రేపటి (జనవరి 12) వరకు వేచి చూడక తప్పదు.
[youtube_video videoid=kLUYJxq0AD0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: