మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ రేంజ్ ఒక్క సారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. సావిత్రగా చేసిన కీర్తి సురేష్ నటనకు అందరూ ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తి సురేష్ లో ఇంత టాలెంట్ ఉందా..ఇంతకు ముందు చూసిన కీర్తి సురేషేనా అని ఆశ్చర్యానికి గురైనవారు లేకపోలేదు. అంతలా మంచి పేరుతో పాటు.. మంచి గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టింది మహానటి సినిమా కీర్తి సురేష్ కు. ఇక మహానటి తరువాత అన్ని లేడి ఒరియెంటెడ్ సినిమాలే క్యూ కట్టడంతో తెలుగులో ఏ సినిమాకు ఓకే చెప్పకుండా కాస్త మాస్ టచ్ ఉండే పందెంకోడి2, సామి, సర్కార్ లాంటి చిత్రాల్లో నటించి తనలోని మరొక యాంగిల్ ను చూపించింది. అయితే ఆ సినిమాల్లో పెద్దగా చేయడానికి ఏం లేదు కాబట్టి కీర్తి సురేష్ కు ఆశించినంత పేరు రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరోసారి లేడి ఒరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా మళ్లీ తెలుగు సినిమానే కావడం విశేషం. నరేంద్ర అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతూ.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేష్ కోనేరు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందించనున్నాడు. ‘‘తెలుగులో ‘మహానటి’ తర్వాత నటిస్తోన్న సినిమా ఇది… ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది… ప్రతి అమ్మాయి కనెక్ట్ అయ్యే సినిమా ఇదని కీర్తి సురేష్ ఇప్పటికే తెలిపారు. మరి మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ తెలుగులో ఒప్పుకున్న మరో సినిమా. ‘మహానటి’ తర్వాత తెలుగులో వచ్చిన అవకాశాలేవీ అంగీకరించని కీర్తి.. ఏరి కోరి ఈ సినిమా ఓకే చేసిందంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
[youtube_video videoid=CxOHlegWpmQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: