”ఆద్యంతమూ లేని అమరానందమే ప్రేమ… ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ…
ప్రేమ దివ్య భావము… ప్రేమ దైవరూపం…
ప్రేమ జీవరాగం… ప్రేమ జ్ఞానరూపం…
మనసున పారే సెలయేరు ప్రేమ… అలసట తీర్చే చిరుగాలి ప్రేమ…
హద్దులేవి లేనిది అందమైన ప్రేమ”…
`ప్రేమ` గురించి ఇంత కన్నా ప్రేమగా చెప్పడం కష్టమేమో కదా! మనసుకవి ఆత్రేయ అందించిన ఈ సాహిత్యంతో వచ్చిన ఆ చిత్రమే `ప్రేమ`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఎన్నో ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘ప్రేమ’ చిత్రం ఒకటి. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు నిర్మించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. వెంకీకి జోడీగా రేవతి నటించగా…. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గొల్లపూడి మారుతీరావు, మంజుల, కల్పన ఇతర ముఖ్యపాత్రలను పోషించారు. ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన పాటలకు మధురమైన బాణీలను అందించారు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా. ‘ఈనాడే ఏదో అయ్యింది’, ‘ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు’, ‘ఎక్కడ ఎక్కడ పోతావురా’, ‘యు ఆర్ మై హీరో’, ‘ఐయామ్ సారీ’, ‘ఒంటరి వాడిని నేను’, ‘ప్రియతమా నా హృదయమా’ పాటలు సినీ ప్రియుల నీరాజనాలు అందుకున్నాయి. ‘అన్బు చిన్నమ్’ పేరుతో తమిళంలో ఈ చిత్రం అనువాదం కాగా… హిందీలో సల్మాన్ ఖాన్, రేవతి జంటగా ‘లవ్’ పేరుతో ఈ సినిమాని సురేష్ బాబు పునర్నిర్మించారు. జనవరి 12, 1989న విడుదలైన ‘ప్రేమ’… నేటితో 30 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
‘ప్రేమ’ – కొన్ని విశేషాలు:
* వెంకటేష్, రేవతి తొలిసారి జంటగా నటించిన చిత్రం.
* సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం ఇదే. తర్వాత సురేష్ కృష్ణ, వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ధర్మచక్రం’ కూడా 1996లో సంక్రాంతి సందర్భంగానే విడుదల కావడం విశేషం.
* వెంకటేష్, ఇళయరాజా కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ఇది. దీనికి ముందు ‘స్వర్ణకమలం’, ‘వారసుడొచ్చాడు’ సినిమాలకు సంగీతం దర్శకులుగా పనిచేసారు ఇళయరాజా.
* ఈ చిత్రానికి గాను వెంకటేష్ తొలిసారిగా ఉత్తమ నటుడు విభాగంలో నంది అవార్డుని అందుకున్నారు.
* ఉత్తమ దర్శకుడిగా సురేష్ కృష్ణ నంది పురస్కారాన్ని అందుకున్నారు.
* అలాగే గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ, ఉత్తమ గాయకుడిగానూ రెండు నంది పురస్కారాలను కైవసం చేసుకున్నారు.
[youtube_video videoid=zApfsNJJR8Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: