వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందిన లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి 2018 మే 9 తేదీ రిలీజయి విజయ ఢంకా మ్రోగించింది. తమిళ, మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ కూడా విజయం సాధించాయి. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలలో నటించగా నాగ చైతన్య, మోహన్ బాబు, నరేష్, దర్శకులు క్రిష్, సందీప్ వంగ, తరుణ్ భాస్కర్, రచయిత బుర్రా సాయి మాధవ్ అతిథి పాత్రలలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో మహానటి అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. మహానటి మూవీ అనేక గౌరవ పురస్కారాలు పొందింది. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. పూణే లో జరుగుతున్న 17 వ పూణే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జనవరి 13 వ తేదీ 1PM కు సిటీ ప్రైడ్, కొత్రుడ్ , పూణే వేదికగా మహానటి మూవీ స్క్రీనింగ్ జరుగనుంది.
[youtube_video videoid=BYaB0AvfojU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: