కృష్ణ, శోభన్‌బాబు కలయికలో వచ్చిన పలు మల్టీస్టారర్ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘మంచి మిత్రులు’ ఒకటి. స్నేహబంధం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాని మధు పిక్చర్స్ పతాకంపై పి.మల్లికార్జునరావు నిర్మించగా తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. ఇందులో విజయనిర్మల, చలం, నాగభూషణం, గీతాంజలి ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఎస్.పి.కొదందపాణి సంగీతసారథ్యంలో పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ ఈనాటికి వినిపిస్తూనే ఉంటుంది. తాతినేని రామారావు దర్శకత్వం వహించిన మూడో చిత్రం ఇది. అంతేకాదు… కృష్ణ, శోభన్ బాబును తొలిసారిగా డైరెక్ట్ చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. 1969 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మంచి మిత్రులు’… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=6UL86ap4vlY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: