మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండగా… సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి సగానికి పైగా చిత్రీకరణ పూర్తయ్యింది. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమా కోసం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం రోడ్డులోని ఘాట్ కంచె భూముల్లో భారీ సెట్టింగ్స్ కి సంబంధించిన పనులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆలయ ముఖద్వారం, మంటపాలు, రథాలు, పూజా సామాగ్రి, దుకాణాల సెట్టింగులను రూపొందిస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఈ సెట్టింగ్ నిర్మాణం జరగనున్నదని సమాచారం. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న `సైరా`లో చిరుకి జోడీగా నయనతార, తమన్నా నటించగా… అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దసరా కానుకగా ఈ సినిమా తెరపైకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=mmEMDbivmzs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: