సంక్రాంతి సందర్భంగా జనవరి 12 న విడుదలైన పలు చిత్రాలు… అటు కథా పరంగాను, ఇటు సంగీతం పరంగాను ప్రేక్షకులను అలరించాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళ్తే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రల్లో ఎల్.వి.ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘మిస్సమ్మ’. 1955 జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అలాగే… యన్టీఆర్, ఏయన్నార్ కాంబినేషన్‌లో వచ్చిన మరో చిత్రం ‘తెనాలి రామకృష్ణ’(1956) కూడా ఇదే తేదీకి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక కైకాల సత్యనారాయణ, షావుకారు జానకి ప్రధాన పాత్రధారులుగా చిరంజీవి అతిథి పాత్ర పోషించిన కుటుంబ కథా చిత్రం ‘తాయారమ్మ బంగారయ్య’(1979) కూడా ఇదే రోజు విడుదలై ప్రేక్షకుల మన్ననలను పొందింది. అలాగే దర్శకరత్న దాసరి నారాయణ రావు రూపొందించిన `కోరికలే గుర్రాలయితే` (1979) సినిమా కూడా ఇదే తేదికి ప్రేక్షకుల ముందుకొచ్చి… మంచి విజయం సాధించింది.
అలాగే కృష్ణ, సౌందర్య, ఆమని, ఇంద్రజ హీరోహీరోయిన్లుగా నటించిన ‘అమ్మదొంగా’(1995) కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ప్రజాదరణ పొందింది. అదేవిధంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకమాయాజాలంతో… శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘పెళ్లిసందడి’(1996)… ఆ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలవడమే కాకుండా మ్యూజికల్ గా సెన్సేషన్ సృష్టించింది. అలాగే మరో మ్యూజికల్ హిట్ `స్టైల్` కూడా 2006లో ఇదే రోజున విడుదలై కమర్షియల్‌గా మంచి హిట్ అయ్యింది. అలాగే… 2007లో ఇదే రోజున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేశముదురు’ కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అలాగే రవితేజ, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన `కృష్ణ` కూడా 2008లో ఇదే జనవరి 12న రిలీజై సక్సెస్ అయ్యింది. ఇక ఇదే తేదీకి వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్ చిత్రం ‘ఎవడు’(2014) కూడా సంక్రాంతి విజయాన్ని నమోదు చేసుకుంది.
గత రెండు సంవత్సరాలుగా సంక్రాంతి హీరో అనిపించుకుంటున్న బాలకృష్ణ… క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన తన వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’(2017)ని ఇదే జనవరి 12న విడుదల చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే… 2018లో మరోసారి సంక్రాంతి కానుకగా ఇదే డేట్‌ను టార్గెట్ చేస్తూ… తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందించిన ‘జై సింహా’తో మరోసారి విజయాన్ని అందిపుచ్చుకున్నారు బాలయ్య.
మొత్తానికి… పలు విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన జనవరి 12న… వచ్చిన వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ‘F2’ కూడా మంచి విజయం సాధిస్తుందేమో చూడాలి. మరి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి..
[youtube_video videoid=FRsoop60Ds8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: