2.0 సినిమా అలా అయిందో లేదో ఇలా భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 సినిమా పనిలో పడిపోయారు డైరెక్టర్ శంకర్. 1996 లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాంతో ఈ సీక్వెల్ పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా కాజల్ నటిస్తుందన్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు తాజాగా మరో భామ కూడా ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ భామ ఎవరనుకుంటున్నారా..?
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో భాగంగా కొంత షూటింగ్ తైవాన్ లో జరగనుందట. ఈ నేపథ్యంలోనే అక్కడి యాక్షన్ సన్నివేశాల్లో కొరియన్ స్టార్ హీరోయిన్ సూజీ బే ను తీసుకున్నట్లు సమాచారం. ఈ పాత్రతో చాలానే యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ఇంకా ఈ సినిమాలో శింబు, దుల్కర్ సల్మాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 18వ తేదీ నుండి జరగనున్నట్టు ఇప్పటికే తెలిపారు. కాగా లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
[youtube_video videoid=wcdrXwZo198]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: