సినిమా అన్నది ఎక్స్టర్నల్ గా ఆర్టిస్టుల మీడియా అయితే ఇంటర్నల్గా టెక్నీషియన్స్ మీడియా. ఆర్టిస్టులకు హెడ్ హీరో అయితే టెక్నీషియన్స్ కు హెడ్ దర్శకుడు. అయితే ప్రజాబాహుళ్యంలో హీరోకు ఉండే పాపులారిటీ దర్శకులకు ఉండకపోవచ్చు గాని దర్శకుడు క్రియేట్ చేసే పాత్ర వల్లనే హీరో ఎలివేట్ అవుతాడు. ప్రతి దర్శకుడు తన హీరోకి ఒక అద్భుతమైన పాత్రను క్రియేట్ చేసి హిట్ కొట్టాలనే ప్రయత్నిస్తాడు. కానీ అన్ని సందర్భాలలో అన్ని పాత్రలు క్లిక్ అవ్వవు. కానీ ఇవ్వాళ రిలీజైన ఎఫ్-2 చిత్రంలో ఒక మంచి కాంబినేషన్ వండర్ కనిపించింది. నిజానికి ఒక సినిమా జయాపజయాలలో ఆర్టిస్టుల కన్నా దర్శకుడి ప్రభావ, ప్రమేయాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక దర్శకుడు ఒక మంచి చాలెంజింగ్ క్యారెక్టర్ ను క్రియేట్ చేసినప్పుడు యాక్టర్ ఎంతగా చెలరేగిపోయి ఆ పాత్రకు న్యాయం చేయగలడో చెప్పటానికి ఈరోజు విడుదలయిన ఎఫ్ – 2 లో దర్శకుడు అనిల్ రావిపూడి- హీరో వెంకటేష్ ల కాంబినేషన్ను ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన మూడు పదుల పైబడిన కెరీర్లో హీరో వెంకటేష్ ఇలాంటి హిలేరియస్ కేరక్టర్స్ చాలా చేశారు… మెప్పించారు. కానీ తాజాగా ఎఫ్-2 లో వెంకటేష్ పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా షాక్ అవుతాము. బరువైన సెంటిమెంటల్ క్యారెక్టర్స్, తన క్యారెక్టర్ ను తక్కువ చేసుకుని కథను ఎలివేట్ చేసే అండర్డాగ్ క్యారెక్టర్స్ ఎన్నెన్నో చేసి మెప్పించిన వెంకటేష్ ఎఫ్ -2 లో అవుట్ అండ్ అవుట్ కామెడీ కేరెక్టర్ ను అద్భుతమైన టైమింగ్ తో పోషించి హాట్సాఫ్ అనిపించారు. నిజానికి ఎఫ్-2 లో వెంకటేష్ ఆ క్యారెక్టర్ ను పోషించిన విధానం చూస్తే – what an Actor, what a performer with wonderful timing అని మెచ్చుకోనివారు ఉండరు. అంత బాగా చేశారు వెంకటేష్. ఈ మధ్యకాలంలో ఇలాంటి సందర్భాలలో జనం తరచుగా చించేసాడు, ఇరగదీసాడు, కుమ్మేసాడు వంటి పదాలు వాడుతున్నారు. నిజానికి అవి అంత రిఫైన్డ్ వర్డ్స్ కావు. కానీ నొక్కివక్కాణించవల్సిన సందర్భాలలో ఇలాంటి పదజాలం వాడటం తప్పదేమో. నిజంగానే వెంకటేష్ “చించేసాడు”.
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి విషయానికి వస్తే- తెరమీద నటించే హీరో కే కాదు.. దాన్ని తెరకెక్కించే దర్శకుడికి కూడా అద్భుతమైన టైమింగ్, సెన్సాఫ్ హ్యూమర్ , టేకింగ్ సెన్స్ ఉంటే ఎలాంటి రిజల్ట్ ఇవ్వవచ్చో అనిల్ రావిపూడి మరోమారు నిరూపించారు. మొత్తానికి ఇవ్వాల్టి ఎఫ్ -2 లో తెర వెనుక ఉండే దర్శకుడి ప్రతిభ- తెర మీద ఉండే నటుడి సత్తా పోటీపడ్డట్టుగా అనిపిస్తుంది. కేవలం వెంకటేష్ నుండే కాదు… వరుణ్ తేజ్, హీరోయిన్స్ తమన్నా, మెహరీన్, ప్రగతి, రాజేంద్ర ప్రసాద్, ఝాన్సీ, ప్రకాష్ రాజ్- ఇలా ప్రతి ఆర్టిస్ట్ నుండి తనకు కావలసిన పర్ఫార్మెన్స్ ను అద్భుతంగా అందుకోగలిగాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
ఎబో ఆల్ – ఈ స్క్రిప్ట్ లో టన్నుల కొద్దీ ఫన్ను ఉందని గ్రహించిన దిల్ రాజు జడ్జిమెంట్ ను అభినందించాలి .
[youtube_video videoid=zApfsNJJR8Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: