జ‌న‌వ‌రి 11… తెలుగు సినిమా చ‌రిత్ర‌లో `వ‌న్ ఆఫ్ ది ల‌క్కీయ‌స్ట్ డేట్స్‌`

January 11th – Luckiest Date For Telugu Cinema, January 11th Good Day For Telugu Movies, Latest Telugu Movies 2019, Luckiest Date For Telugu Cinema, Telugu Film Updates, Telugu Filmnagar, TFI Luckiest Date For Telugu Cinema, Tollywood Cinema Latest News, Tollywood Movies Luckiest Day Jan 11th
January 11th - Luckiest Date For Telugu Cinema

కొన్ని తేదీలు భ‌లేగా మ్యాజిక్ చేస్తాయి. తెలుగు సినిమాకు సంబంధించి కూడా అలాంటి తేదీలు కొన్ని ఉన్నాయి. వాటిలో జ‌న‌వ‌రి 11 ఒక‌టి. సంక్రాంతి సీజ‌న్ సంద‌ర్భంగా ఈ తేదికి విడుద‌లైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించాయి. అలాగే ఇండ‌స్ట్రీ హిట్ కూడా వ‌చ్చిన వైనం ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… 1985లో సూప‌ర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభిన‌యంలో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు రూపొందించిన `అగ్ని ప‌ర్వ‌తం` ఇదే తేదికి రిలీజై అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అలాగే ఇదే తేదికి వ‌చ్చిన న‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు చిత్రం `సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలు` (1991) తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే `వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌`గా నిల‌చింది. ఇక ఇదే తేదికి 2001లో రిలీజైన న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `న‌ర‌సింహ‌నాయుడు` ఏకంగా ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది.

అలాగే… ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై… సెన్సేష‌న‌ల్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిల‌చిన `దేవ‌దాసు` (రామ్‌, ఇలియానా తొలి చిత్రం) (2006) కూడా ఇదే జ‌న‌వ‌రి 11కి అప్ప‌ట్లో బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద దుమారం రేపింది. అలాగే… ఈ జ‌న‌రేష‌న్ లో మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ కి నాంది ప‌లికిన విక్ట‌రీ వెంక‌టేష్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` (2013) కూడా ఇదే మ్యాజిక‌ల్ డేట్‌కి వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది.

ఇక రెండేళ్ళ క్రితం అంటే 2017లో మెగాస్టార్ చిరంజీవి కూడా `ఖైదీ నంబ‌ర్ 150`తో ఇదే తేదిన తెర‌పై మెగా రీ-ఎంట్రీ ఇచ్చి మ‌రోసారి `బాక్సాఫీస్ కా బాప్` అనిపించుకున్నారు. మ‌రి… ఇన్ని విజ‌యాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన జ‌న‌వ‌రి 11నే (ఈ రోజే) వ‌స్తున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాజా చిత్రం `విన‌య విధేయ రామ‌` రిసల్ట్ ఎలాఉంటుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=DZ9GdjMHXFM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =