వైవిద్యమైన పాత్రలు ఎంచుకోవడంలో నిత్యామీనన్ ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి తను ఇంతవరకూ చేసిన సినిమాలు చూస్తే అర్ధమవుతోంది. ఇప్పుడు అదే మరోసారి నిరూపించింది. ప్రాణ అనే కొత్త కాన్సెప్ట్..తన ఒక్క పాత్ర మాత్రమే ఈ సినిమాలో ఉంటుంది..అలాంటి కాన్సెప్ట్ సినిమాలో నటిస్తోంది నిత్యామీనన్. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. మలయాళంలో ఈ సినిమా ను జనవరి 18వ తేదీన విడుదల చేస్తుండగా…తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను… ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ లో ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. విశేషం ఏంటంటే ఈ పాట సంస్కృతంలో ఉంటుంది. హరి నారాయణ్ రాసిన ఈ పాటను రతీష్ వేగ కంపోజ్ చేయగా శిల్ప రాజ్ అనే అమ్మాయి పాడింది.
కాగా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇండియా టాప్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. లూయిజ్ బ్యాంక్స్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ రకుల్ పూకుట్టి ఈ సినిమా కోసం తొలిసారిగా ‘సింకర్‌నైజ్డ్ సరౌండ్ సౌండ్ సిస్టమ్’ అనే కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. మరి ఒక్క క్యారెక్టర్ తో ఈ సినిమాను ఎలా నడిపించారో తెలియాలంటే సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=LiDDKnYtV8U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: