ఇప్పటివరకూ ఆ రికార్డ్ ‘దాన వీర సూర కర్ణ’ సినిమాదే..!

Tuesday Trivia: An Interesting Fact about Daana Veera Soora Karna

సాధారణంగా ఒక సినిమా నిడివి ఎంత అంటే ఇప్పుడున్న వాళ్ళు టక్కున 2 గంటల 30 నిముషాలు అని చెప్పేస్తారు. దాదాపుగా ఇప్పుడున్నఅన్ని సినిమాలు 2.30 నిముషాలే నిడివి ఉంటుంది. ఏదో కొన్ని సినిమాలు మాత్రం 3 గంటలు తీస్తున్నారు. దానికే ఇప్పుడు అబ్బో 3 గంటలా.. ఎవరు చూస్తారు అని అంటారు. ఇప్పుడు ఇలా కానీ పాతతరంలో అన్ని సినిమాలు దాదాపు మూడు గంటలు నిడివి ఉండేవి. ఇక నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు దాన వీర శూర కర్ణ సినిమా అయితే ఏకంగా 4 గంటల 17 నిముషాలు ఉంటుంది. ఇక ఆ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రతి సినిమా ప్రేక్షకుడికి తెలుసు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆయన కృష్ణుడి వేషం వేస్తే ఆయనే కృష్ణుడు.. రాముడు వేషం వేస్తే రాముడు.. రావణుడు అయితే రావణుడు.. అర్జునుడు, శివుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.. ఏ పాత్ర అయినా అది ఆయన కోసమే పుట్టినట్టు ఉంటుంది. అప్పట్లో ఎన్టీఆర్ ఫొటోలనే పెట్టుకొని దేవుడిగా కొలిచేవారంటేనే చెప్పొచ్చు… ఆయనను ప్రేక్షకులు నటుడిగా కాకుండా దేవుడిగా భావించేవాళ్ళని. అలాంటి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమానే దాన వీర శూర కర్ణ.

నందమూరి తారక రామారావు, కొండవీటి వెంకటకవి కలసి సృష్టించిన సంచలన చిత్రం ఇది. ఈ సినిమా పూర్తిగా ఎన్.టి.ఆర్. శ్రమ ఫలితం. 1977 సంవత్సరంలో విడులైన ఈ పౌరాణిక చిత్రం ఎన్నో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఎన్.టి.ఆర్. ఈ సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించడంతో పాటు ఈ సినిమాలో కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించాడు. ఇక ఈ సినిమా నిడివి మొత్తం 4 గంటల 17 నిముషాలు. ఈ 4 గంటల 17 నిమిషాల్లో దాదాపు నాలుగు గంటల పాటు ఎన్టీఆర్ స్క్రీన్ పైన ఉంటాడు. అది మాములు విషయం కాదు. దాదాపు నాలుగు గంటలపాటు ఎన్.టి.ఆర్. ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా చిత్రీకరణ కేవలం 43 రోజుల్లో పూర్తి అయ్యింది. కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది. ఇవన్నీ ఒక ఎతైతే ఇంత వరకూ ఎవరూ చెరపని ఒక రికార్డ్ ఈ సినిమాకే సొంతం. ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో లాంగ్వేజస్ లో ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఏ సినిమాను కూడా 4 గంటల దాటి నిడివిలో తీయలేదు. అయితే రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్ సినిమా 4 గంటల 24 నిముషాలు తీశారు కానీ ఆ తర్వాత మళ్ళీ 40 నిమిషాలు కట్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన సినిమా మరొకటి లేదు. చూద్దాం మరి భవిష్యత్తులో అయినా ఈ రికార్డ్ బ్రేక్ చేసే సినిమా వస్తుందేమో.

కాగా ఎన్. టి రామా రావు తో పాటు ఈ సినిమాలో జయప్రభ, రజనాల, ప్రభాకర్ రెడ్డి, హరి కృష్ణ, బాలకృష్ణ, శారధ, జె పి శర్మ, కైకాల సత్యనారాయణ, గుమ్మడి వెంకటేశ్వర రావు, చలపతి రావు, జగ్గ రావు, బి సరోజ దేవి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాని ఎన్ టి రామా రావు తన స్వియ దర్శకత్వం లో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు పెంద్యాల మగేశ్వరరావు సంగీతం అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 6 =