హన్సిక “మహా ” మూవీ కొత్త పోస్టర్ రిలీజ్

Hansika's new movie Mahaa poster unveiled

ఎట్సెట్రా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యు ఆర్ జమీల్ దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో “మహా ” తమిళ మూవీ రూపొందుతుంది. థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో తమిళ స్టార్ హీరో శింబు అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి గిబ్రాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మహా ” మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “మహా ” మూవీ సంగీత దర్శకుడు గిబ్రాన్ కు 25 వ మూవీ కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “దేశముదురు “మూవీ తో హన్సిక టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “కందిరీగ “, దేనికైనా రెడీ “, “పాండవులు పాండవులు తుమ్మెద “, “పవర్ “, “తెనాలి రామకృష్ణ BABL” వంటి మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “మాప్పిళై ” మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెట్టిన హన్సిక తమిళ చిత్రాలతో బిజీగా మారారు. పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ లో హన్సిక నటించారు. హీరోయిన్ హన్సిక 50 వ చిత్రంగా “మహా ” మూవీ రూపొందుతుంది. హన్సిక బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. రక్తం తో తడిచిన చేతులతో హన్సిక ఫేస్ కవర్ చేసిన ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 14 =