కరోనా వార్తలపై వర్మ కౌంటర్..!

RGV's Strong Counter To Rumours about His Health

ఈమధ్య టాలీవుడ్ సెలబ్రిటీస్ వరుసగా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి షూటింగ్ లకు వెళ్లకుండా ఇంట్లోనే హోమ్ క్వారెంటైన్ లో ఉంటున్న వాళ్లకు కూడా రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజమౌళి నుండి మొదలుపెట్టగా ఇప్పటివరకూ చాలా మంది పేర్లు వినిపించాయి. ఇక నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకు కూడా కరోనా వచ్చిందంటూ వార్తలు విన్పిస్తున్నాయి. మరి సైలెంట్ గా నాకు రాలేదు అని చెపితే వర్మ ఎందుకు అవుతాడు. ఎప్పటిలాగే తన ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందిస్తూ చేతిలో డంబెల్ పట్టుకొని వర్కవుట్ చేస్తూ కౌంటర్ వేసాడు వర్మ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేను అనారోగ్యంగా ఉన్నానని, నాకు కోవిడ్ సోకిందేమో అనే అనుమానం కలుగుతోందని కొందరు సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టిస్తున్నారు. వాళ్లందరినీ డిజప్పాటింట్ చేస్తూ, మీ సంతోషానికి చెక్ పెడుతూ నేను చెప్పేది ఒక్కటే.. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నాను. వరుసపెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు రూపొందిస్తున్నాను. భవిష్యత్తులో మీ కోరిక నెరవేరాలని విష్ చేస్తున్నాను… కానీ నేను మాత్రం వర్కౌట్స్ చేస్తూ ఆరోగ్యంగా ఉంటాను అని తనదైన స్టైల్ లోనే చెప్పాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా ఆర్జీవీ స్టైల్‌లోనే కామెంట్స్ చేస్తున్నారు. ‘వర్మను చూస్తే కరోనా అయినా సరే పారిపోవాల్సిందే’ అంటూ రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.

 

ఇక ఈ లాక్ డౌన్ లో నిరంతరాయంగా ఎవరైనా వరుస సినిమాలు షూటింగ్ లు చేశారంటే అది వర్మ మాత్రమే. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం వర్మ ప్రకటించిన వాటిలో ‘కరోనా’ ‘మర్డర్’ ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ ‘ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ’, 12 ‘O’ క్లాక్, ‘పవర్ స్టార్’ సినిమాలు వున్నాయి. ఇక నిన్నఇండియాలో తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రకటించారు వర్మ. ఇది ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీ అని పేర్కొంటూ దానికి ‘డేంజరస్’ అనే టైటిల్ డిసైడ్ చేసి పోస్టర్ కూడా వదిలారు. మరి ఇన్ని సినిమాల్లో ఎన్ని సినిమాలు విడుదల అవుతాయో.. ఏంటో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =