డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ఆర్ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ కలెక్షన్స్ తో 4 నెలలుగా దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ వన్ బిలియన్ యెన్ (63 కోట్లు ) పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇండియా సినిమాల నుంచి జపాన్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఆర్ఆర్ఆర్ మూవీ ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఆర్ఆర్ఆర్ మూవీకి జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ లో తెలుగు సినిమా సత్తాను చాటింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























