త్వరలో ఏజెంట్ మ్యూజికల్ బ్లాస్ట్

Musical Blast Soon From Akhil Agent Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Movie Updates,Agent Telugu Movie Latest News,Agent Movie Release Date,Agent Pre Release Event Date,Agent Telugu Movie Pre Release Event Date Confirmed,Akhil Agent Movie Musical Blast

రీసెంట్ గానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే రొమాంటిక్ కామెడీతో వచ్చి హిట్ ను సొంతం చేసుకున్నాడు అఖిల్. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ రూపొందుతుంది. ఇక ఈసినిమా కోసం అఖిల్ కూడా తన మేకర్ ను పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటినుండే మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇటీవల విడుదల చేసిన రిలీజ్ డేట్ వైల్డ్ యాక్షన్ గ్లింప్స్ కూడా క్యూరీయాసిటీని పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. శివరాత్రి పండుగ సందర్భంగా శుభాక్షాంక్షలు తెలుపుతూ త్వరలోనే ఏజెంట్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. చార్ట్ బస్టర్ కంపోజర్స్ హిప్‌హాప్‌ తమిళ సంగీతం అందించిన ఏజెంట్ ఎక్స్ టార్డినరీ సాంగ్స్ ని గ్రాండ్ విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఏజెంట్ బ్రాండ్ న్యూ పోస్టర్ లో అఖిల్ టెర్రిఫిక్ గా కనిపించారు.

కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.