సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్

Latest Update about Sankranti Movies OTT Release,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Veera Simha Reddy,Waltair Veerayya,Vaarasudu,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Telugu Movie Latest News,Veera Simha Reddy OTT Release Date Locked,Balakrishna,Shruti Haasan,Thaman S,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Telugu Movie Latest News,Waltair Veerayya Movie OTT Release Date Locked,Vaarasudu Movie,Vaarasudu Telugu Movie,Vaarasudu Movie Updates,Vaarasudu Telugu Movie Latest News,Vaarasudu Movie OTT Release Date Loked

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. భారీ కలెక్షన్స్ సాధించిన ఈమూవీ బాలకృష్ణ సినీ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈమూవీ ఫిబ్రవరి 23వ తేదీ నుండి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ 230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో భారీ ఫ్రాఫిట్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ ఫిబ్రవరి 27 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ తమిళ వెర్షన్ వారిసు 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. వారిసు మూవీ హిందీ వెర్షన్ వారిస్ 13 వ తేదీ, తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యాయి. విజువల్‌గా గ్రాండియర్‌గా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ వారిసు తమిళ మూవీ, తెలుగు వెర్షన్ వారసుడు మూవీస్ బ్రేక్ ఈవెన్ సాధించాయి. వారిసు తమిళ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి 300కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ ఫిబ్రవరి 22 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =