ఒకటో నెంబర్ కుర్రాడు తారక రత్న ఇక లేరు

Actor Taraka Ratna Passed Away,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Taraka Ratna No More,Taraka Ratna Passed Away,Taraka Ratna RIP,Taraka Ratna Passes Away,Hero Taraka Ratna Passes Away,Taraka Ratna Latest News,Taraka Ratna Live News

2001 సంవత్సరంలో తారక రత్న న‌ట‌న‌పై ఆస‌క్తితో సినీ రంగ ప్ర‌వేశం చేశారు. తార‌క‌ర‌త్న‌ హీరోగా ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఒకే రోజు అత్య‌ధిక సినిమాలు ఓపెనింగ్ చేసుకొన్న‌ హీరోగా తార‌క‌ర‌త్న గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు. కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఒక‌టో నంబ‌ర్ కుర్రాడు సినిమాతోతారక రత్న హీరోగా టాలీవుడ్‌ కు పరిచయం అయ్యారు. ఆ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. రెండు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో తారకరత్న 30కిపైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తారక రత్న ప్రేక్షకులను అలరించారు. ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అమ‌రావ‌తి సినిమాతో తార‌క‌ర‌త్న విల‌న్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను మొద‌లుపెట్టారు. ఈ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తారకరత్ననంది అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గ‌త 23 రోజులుగా ప్ర‌త్యేక వైద్య బృందంతో పాటు విదేశీ డాక్ట‌ర్ల‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నారాయ‌ణ హృద‌యాల‌య‌లో చికిత్స పొందుతున్న తార‌క‌ర‌త్న ఆరోగ్యం విష‌మించ‌డంతో తుదిశ్వాస‌విడిచారు. ఆసుప‌త్రిలో చేరిన రోజు నుంచి తార‌క‌ర‌త్న కోమాలోనే ఉండ‌టంతో వెంటిలేట‌ర్‌పై ట్రీట్‌మెంట్‌ను కొన‌సాగించారు. ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డుతోన్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ శ‌నివారం మ‌రోసారి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో తార‌క‌ర‌త్న క‌న్నుమూశారు. తార‌క‌ర‌త్న మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ‌తో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =