పుష్ప 2 క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Interesting Update on Pushpa 2 Climax,Telugu Filmnagar,,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Pushpa 2,Pushpa 2 Movie,Pushpa 2 Telugu Movie,Pushpa 2 Movie Updates,Pushpa 2 Telugu Movie Latest News,Pushpa 2 Movie Climax,Pushpa 2 Climax,Pushpa 2 Telugu Movie Climax,Allu Arjun Pushpa 2 Climax,Allu Arjun,Rashmika Mandanna,Sukumar,DSP,Devi Sri Prasad

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఒకవైపు షూటింగ్ జరుపుకుంటుండగానే ఈసినిమాపై పలు ఆసక్తికర విషయాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. ఇక ఇప్పుడు మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈసినిమా క్లైమాక్స్ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తుంది. పుష్ప 2 క్లైమాక్స్ లో బన్నీ కొత్త లుక్ లో కనిపిస్తాడని.. అది మూడో పార్ట్ కి లీడ్ అని తెలుస్తోంది. రష్మిక పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఈ ట్విస్ట్ సినిమాకే థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా నిలుస్తోందని.. పైగా ఈ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. మరి పార్ట్ 3 ఉంటుందా? పుష్ప పార్ట్ 2 తోనే ఆగిపోతుందా?లేదా? ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.