#VT13 హీరోయిన్ అప్ డేట్

Interesting Update on VT13 Heroine,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,VT13,VT13 Movie,VT13 Telugu MovieVT13 Movie Updates,VT13 Telugu Movie Latest News,VT13 Actress,VT13 Heroine,Varun Tej 13th Movie Heroine,Varun Tej 13th Movie Actress,Varun Tej Upcoming Film Actress

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యంగ్ హీరోలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. అంతేకాదు తమ సినిమాలతో ప్రతిఒక్కరు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వారిలో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న నటుడు వరుణ్ తేజ్. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో శక్తి ప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈసినిమాలో క్యాస్టింగ్ కు సంబంధించిన వివరాలు అయితే ఇప్పటివరకూ తెలియచేయలేదు. అయితే తాజాగా ఈసినిమా నుండి హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ ను రేపు ఉదయం 10 గంటల 6 నిమిషాలకు ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా వరుణ్ 12వ సినిమాగా వస్తుంది. ఈసినిమాకు గాండీవధారి అర్జున అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 16 =