NTR30 ఓపెనింగ్ డేట్ వాయిదా

NTR30 Opening Ceremony Postponed,NTR 30 Opening Ceremony Has Been Postponed Again,Telugu Filmnagar,,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,NTR 30,NTR 30 Movie,NTR 30 Telugu Movie,NTR 30 Movie Updates,NTR 30 Telugu Movie Latest News,NTR 30 Opening Ceremony Postponed,NTR 30 Movie Opening Ceremony Postponed,NTR 30 Telugu Movie Opening Ceremony Postponed,Jr NTR,Koratala Siva,Saif Ali Khan

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తుండగా.. ఈసినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డేట్ వాయిదా పడింది. నందమూరి తారక రత్న మరణం వల్ల ఎన్టీఆర్ 30 వ సినిమా ఓపెనింగ్ డేట్ ను వాయిదా వేశారు. కొత్త డేట్ ను త్వరలో తెలియచేయనున్నారు. కాగా నారా లోకేష్ యువగళం ప్రారంభం రోజున పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఇక దాదాపు మూడు వారాల పాటు బెంగుళూరు లోని హాస్పిటల్ లో చికిత్స పొందతూ పరిస్థితి కాస్త విషమించడంతో నిన్న మరణించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 11 =