కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kushi Movie

ట్యాగ్ · 63 కథనాలు

vijay deverakonda kushi movie new record in tamil nadu
సినిమా వార్తలు

ఖుషి తమిళ్ లో కొత్త రికార్డ్

ఎన్ని సినిమాలు చేసినా విజయ్ దేవరకొండ అంటే మాత్రం గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి సినిమానే. ఆ సినిమానే విజయ్ సినీ కెరీర్ ఓ మలుపు తిప్పింది. ఈఒక్క సినిమా వల్లనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి తరువాత పలు సినిమాలు చేశాడు. వాటిలో కొన్ని సూపర్ హిట్లు అయ్యాయి.. కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం అయితే విజయ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
Which movie will you watch this weekend in OTT
ఓటీటీ

ఈ వీకెండ్ ఏ ఓటీటీ మూవీ కి మీ ఓటు?

ఈమధ్య కాలంలో ఓటీటీ ల హవా ఎంత పెరిగిందో చూశాం. థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయినా కొద్ది రోజులకో ఓటీటీల్లో సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్లలో చూడకపోయినా ఓటీటీల్లో వస్తుందిలే.. అప్పుడు చూడొచ్చులే అన్న ఆలోచనలో ఉంటున్నారు ప్రేక్షకులు. ఇక కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం అయితే పలు సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. కొన్ని కొత్త సినిమాలతో పాటు ఇప్పటికే థియేటర్లలో సందడి చేసిన సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చాయి. మరి ఈ వీకెండ్ మీరు ఏ సినిమాను చూడాలని అనుకుంటున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda and Samantha Starrer Kushi OTT Release Date Locked
ఓటీటీ

ఓటీటీలోకి వస్తున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు నటించిన రొమాంటిక్ చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్ 1 న విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.30 కోట్ల కలెక్షన్స్ సహా మూడు రోజుల్లో రూ.70 కోట్లు కొల్లగొట్టింది. విజయ్ దేవరకొండ గత చిత్రం 'లైగర్‌' భారీ అంచనాలతో వచ్చి ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఖుషి' వంటి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆయన ఈసారి సరైన హిట్‌ను అందుకున్నాడు. అలాగే మరోవైపు నటి సమంత కూడా 'శాకుంతలం' పరాజయం తర్వాత ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

Srikanth Mవాట్సాప్
kushi movie usa collections update
బాక్సాఫీస్

ఖుషి దూసుకుపోతున్న యూఎస్ఏ కలెక్షన్స్

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఖుషి. సెప్టెంబ‌ర్ 1న రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ఇంకా లవ్, కామెడీ యాంగిల్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందించింది. ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే 2023 లో తమిళనాడులో రిలీజ్ అయి అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న తెలుగు మూవీగా ఖుషి నిలిచింది.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda To Share The Joy of Kushi with Rs.1 Lakh Each to 100 Families
సినిమా వార్తలు

100 ఫ్యామిలీస్ లిస్ట్ అనౌన్స్‌ చేసిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన 'ఖుషి' సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. 100 పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తానని కొన్నిరోజులక్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా సక్సెస్ ను తాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని.. అలాగే 100 మంది పేద కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా ఈ సంతోషాన్ని వారికి కూడా పంచుతానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తన టీమ్ 100 కుటుంబాలను గుర్తించనుందని, త్వరలోనే వారి వివరాలు తెలియజేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో ఈరోజు దానికి సంబంధించి విజ‌య్ దేవ‌ర‌కొండ బిగ్…

Srikanth Mవాట్సాప్
kushi movie create new records on tamil nadu
సినిమా వార్తలు

తమిళ్ లో ఖుషి కొత్త రికార్డ్

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఖుషి. సినిమా రిలీజ్ కు ముందు నుండే ఈక్రేజీ కాంబినేషన్ పై అందరికీ ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఈసినిమా పాటలు సినిమాపై హైప్ ను మరింత పెంచేశాయి. ఇక రిలీజ్ అయిన తరువాత కూడా వీరిద్దరి కెమిస్ట్రీకే మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక లవ్, కామెడీ, ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అందరినీ ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Visits Yadadri Temple Along With Family Members and Kushi Movie Team
సినిమా వార్తలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 'ఖుషి' మూవీ టీమ్

టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ 'ఖుషి' మూవీ టీమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఈ ఉదయం దర్శించుకున్నారు. ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ తన తల్లిదండ్రులు, సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండలతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. అలాగే 'ఖుషి' చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మరియు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు, పూజారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Srikanth Mవాట్సాప్
kushi 4days collections
బాక్సాఫీస్

బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్న ఖుషి

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి బాక్సాఫీస్ ను కుమ్మేస్తుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుండడం తో మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 70.23కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.గీత గోవిందం తరువాత 100కోట్ల క్లబ్ లో చేరడం విజయ్ కు ఇది రెండో సారి కానుంది.

Mahender Reddyవాట్సాప్
kushi day 1 collections
బాక్సాఫీస్

మొదటి రోజు సత్తా చాటిన ఖుషి

విజయ్ దేవరకొండ, సమంత ల ఖుషి నిన్న థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తో పాటు సూపర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 30.1 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.తెలుగు రాష్ట్రాల్లో 10కోట్ల షేర్ ను రాబట్టింది.ఈరోజు,రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వున్నాయి. దాంతో ఈ వారాంతంలో ఖుషి 50కోట్ల క్లబ్ లోకి చేరుకోనుంది. అయితే ఈసినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది.ఆ మార్క్ ను చేరుకువాలంటే ఓవరాల్ గా 50కోట్ల షేర్ ను రాబట్టాల్సివుంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఫుల్ రన్ లో ఈ టార్గెట్ ను చేరుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

Mahender Reddyవాట్సాప్
Jawan To Salaar, The Most Awaited Movies Releasing in This September
సినిమా వార్తలు

సెప్టెంబరులో రిలీజ్ అవుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీస్

సినీ ప్రియులకు శుభవార్త. చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు కలిగిన అనేక చిత్రాలు సెప్టెంబరులో విడుదల కానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. వీటిలో స్టార్ హీరో, హీరోయిన్లు నటించిన పలు సినిమాలు సహా మరికొన్ని క్రేజీ చిత్రాలు ఉన్నాయి. జవాన్ నుండి సలార్ వరకు చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలు ఏమిటో ఇక్కడ చూద్దాం..

Srikanth Mవాట్సాప్
kushi telugu movie review
రివ్యూ

రివ్యూ :ఖుషి

ఓవరాల్ గా ఖుషిలో విజయ్ దేవరకొండ ,సమంత నటన అలాగే చివరి 30నిమిషాలు,సాంగ్స్ హైలెట్ అయ్యాయి.ఇక విజయ్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ ను కూడా ఈ ఖుషి ఇచ్చేసింది.ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈసినిమా చూసేయొచ్చు.

Mahender Reddyవాట్సాప్
Kushi Director Shiva Nirvana Interesting Comments on Samantha
సినిమా వార్తలు

‘ఖుషి’లో సమంతను తీసుకోవడానికి అదే కారణం - శివ నిర్వాణ

టాలీవుడ్‌లోని సెన్సిబుల్ డైరెక్టర్లలో శివ నిర్వాణ ఒకరు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను సరికొత్తగా తెరపై ఆవిష్కరించడంలో ఆయనది అందె వేసిన చేయి. శివ నిర్వాణ ఇంతకుముందు తెరకెక్కించిన 'నిన్ను కోరి', 'మజిలీ', 'టక్ జగదీశ్' సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు…

Srikanth Mవాట్సాప్
kushi fifth single out now
సాంగ్

ఖుషి నుండి 5వ సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి మరో 6 రోజుల్లో థియేటర్లోకి రానుంది.ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అవ్వడం అలాగే ట్రైలర్ ప్రామిసింగ్ గా వుండడడంతో సినిమాఫై అంచనాలు పెరిగిపోయాయి.ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ హైప్ తగ్గట్లే జరిగింది.లైగర్,విజయ్ మార్కెట్ ను ఏ విధంగా ప్రభావితం చేయలేకపోయింది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
kushi completes censor formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ఖుషి

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ,ట్రైలర్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది.దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ అదరగొట్టింది.ప్రస్తుతం విజయ్ ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.తెలుగుతోపాటు మిగితా భాషల్లో కూడా విడుదలవుతుండడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ జారీచేసింది.అయితే ఖుషికి రన్ టైం కొంచెం ఎక్కువగానే వుంది.దాదాపు 2గంటల 45నిమిషాల నిడివితో రానుంది.

Mahender Reddyవాట్సాప్
Samantha Shares Glimpses of Her Happy Place at NYC Mornings
ట్రైలర్ & టీజర్

ఏ మాయ చేశావే రోజులను గుర్తుచేసుకున్న సమంత

టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత రూత్ ప్రభు (సామ్‌) ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ లో పాల్గొంది. అనంతరం అక్కడ హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ క్రమంలో సమంత లోకల్‌గా ఉన్న పలు ఫేమస్‌ ప్లేసెస్‌ను విజిట్‌ చేస్తూ సందడి చేస్తోంది. అలాగే తన ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటోంది. కాగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పాపులర్ నటి అయిన సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తన యాక్టింగ్ కెరీర్‌కు విరామం ఇచ్చిన…

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda Interesting Comments on Megastar Chiranjeevi and Superstar Rajinikanth
సినిమా వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌లపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ నటులలో యూత్‌లో మాంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఆయన సినిమాలు చూసి అభిమానులైన వారికంటే తన యాటిట్యూడ్ చూసి అభిమానులైనవారే ఎక్కువగా ఉంటారు. కార్యక్రమం ఏదైనా.. సందర్భం ఏదైనా.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడించడానికి విజయ్ ఎప్పుడూ వెనుకాడరు. తాజాగా ఆయన మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌లను ఉద్దేశించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి, రజినీకాంత్ ఇద్దరూ సూపర్ స్టార్స్ అని, వాళ్ళకి జయం, అపజయం అనేవి చాలా సాధారణ పదాలని పేర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ రెండింటికన్నా ఇంకా ఎక్కువని చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. సమంతతో కలిసి విజయ్ చేసిన కొత్త సినిమా 'ఖుషి'…

Srikanth Mవాట్సాప్
first single out from gangs of godavari
సాంగ్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్

ఈసమ్మర్ లో దాస్ కా ధమ్కీ తో వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు యంగ్ హీరో విశ్వక్ సేన్.ఇక ఈ ఏడాది రెండో సారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. అందులో భాగంగా విశ్వక్ సేన్,గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో రానున్నాడు.ఇందులో విశ్వక్ రగ్గడ్ లుక్ తో ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు.తాజాగా ఈసినిమా నుండి మొదటి పాటను విడుదలచేశారు.సుట్టంలా సూసి అంటూ సాగే ఈ సాంగ్ బాగుంది.శ్రీ హర్ష ఈపాటను రచించగా అనురాగ్ కులకర్ణి గాత్రాన్ని అందించాడు.యువన్ శంకర్ రాజా ఇచ్చిన సంగీతం పాటను మరోస్థాయికి తీసుకెళ్లింది.ఇక ఈసాంగ్ లాంచ్ కార్యక్రమంలో హీరో హీరోయిన్ కలిసి లైవ్ డ్యాన్స్ ఫర్ఫార్మ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Samantha Ruth Prabhu Promises Fans A Grand Return From Her at Kushi Movie Musical Concert
సినిమా వార్తలు

'ఖుషి' మ్యూజిక్ కాన్సర్ట్‌లో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ నటి సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం 'ఖుషి'. రోమ్‌ కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌, సమంత భార్య, భర్తలుగా నటించారు. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. 'హల్లో హైదరాబాద్, ఈ సినిమా కోసం చాలా ఓపికగా ఎదురు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు అభిమానులు ఇక్కడ ప్రత్యక్షంగా పాటలను చూసి ఎంజాయ్ చేయడాన్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ సినిమా…

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda Emotional Speech About Actress Samantha at Kushi Movie Musical Concert
సినిమా వార్తలు

సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉంది - విజయ్ దేవరకొండ

నటి సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉందని అన్నారు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ మేరకు ఆయన మంగళవారం (ఆగస్టు 15, 2023) హైదరాబాద్‌లో జరిగిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. వీరిద్దరూ కలిసి 'ఖుషి' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన 'ఖుషి' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్‌లో హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న నా తరుపున ఖుషి తీసుకొస్తున్నా. చివరిగా అందరికీ ఖుషి…

Srikanth Mవాట్సాప్
kushi movie trailer number 1 trending in social media
ట్రైలర్ & టీజర్

నెంబర్ 1 ట్రెండింగ్ లో ఖుషి ట్రైలర్

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. అందుకే ఈసినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీలవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా విజయ్-సమంత ల మధ్య కెమిస్ట్రీని చూడాలని కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్