ఖుషి తమిళ్ లో కొత్త రికార్డ్

vijay deverakonda kushi movie new record in tamil nadu

ఎన్ని సినిమాలు చేసినా విజయ్ దేవరకొండ అంటే మాత్రం గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి సినిమానే. ఆ సినిమానే విజయ్ సినీ కెరీర్ ఓ మలుపు తిప్పింది. ఈఒక్క సినిమా వల్లనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి తరువాత పలు సినిమాలు చేశాడు. వాటిలో కొన్ని సూపర్ హిట్లు అయ్యాయి.. కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం అయితే విజయ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2023 సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఇక ఈసినిమా తమిళ్ లో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. అయితే అక్కడ ఈసినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తమిళనాట 12 కోట్ల రూపాయలకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ దక్కించుకుంది. షారుఖ్, నయనతార, డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ తర్వాత స్థానం ఖుషి నే సంపాదించుకుంది. విశేషం ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయిన సలార్, యానిమల్ సినిమాలు కూడా తర్వాత స్థానాల్లో ఉండటం. మొత్తానికి విజయ్ దేవరకొండ తన క్రేజ్ ను రోజు రోజుకు పెంచుకుంటూ వెళుతున్నాడు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు.

ఇక ఖుషి సినిమా కథ విషయానికి వస్తే అబ్బాయి ఫ్యామిలీ నాస్తిక కుటుంబానికి చెందింది.. అమ్మాయి ఫ్యామిలీ ఆచారాలు, సంప్రదాయాలకు నిదర్శనమైంది. అలాంటి కుటుంబ నేపథ్యాల నుండి వచ్చిన అమ్మాయి, అబ్బాయి ఎలా ప్రేమలో పడ్డారు.. వారి ప్రేమను కుటుంబ సభ్యులు ఎలా ఒప్పుకున్నారు అన్న పాయింట్ తో ఈసినిమాను రూపొందించాడు శివ నిర్వాణ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =