కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hero Vijay Deverakonda

ట్యాగ్ · 60 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

"జాతిరత్నాలు "మూవీ పై విజయ్ దేవరకొండ ప్రశంసలు

స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో అనుదీప్ కె వి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "జాతిరత్నాలు" మూవీ శివరాత్రి కానుకగా 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఫరియా అబ్దుల్లా కథానాయిక కాగా మురళీశర్మ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రాధన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

"లైగర్ "మూవీ రిలీజ్ పోస్టర్

సూపర్ హిట్ "పెళ్ళిచూపులు" మూవీ తో హీరో గా ఎస్టాబ్లిష్ అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా మారారు. "గీత గోవిందం ", "టాక్సీవాలా "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "లైగర్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో పాత్రకై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'లైగర్' సెట్ లో 'శివగామి'

విజయ్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం లైగ‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు చిత్రయూనిట్. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది. అంతేకాదు అక్కడికి వెళ్లిన విజయ్ అక్కడ బాలీవుడ్ భామలతో పార్టీలు చేస్తూ బిజీ గా వున్నాడు. తాజాగా `లైగ‌ర్‌` టీమ్ అంతా ప్ర‌త్యేకంగా ఇటీవ‌ల ఓ పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో క‌రణ్‌‌ జోహార్, చార్మి, పూరి, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో పాటు బాలీవుడ్ హాట్ బేబ్స్ కియారా అద్వానీ, సారా అలీఖాన్ పాల్గొన్నారు.ఇక ఈ ఫొటోలు సోషల్…

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

విజయ్ దేవరకొండ హ్యాపీ ఎమోషనల్

ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ కు యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అలాంటి హీరోకు తన సినిమా ఎవరైనా చూస్తారా అన్న డౌట్ వచ్చిందట. మరి ఆ డౌట్ ఎందుకొచ్చిందో అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.

TFN Adminవాట్సాప్
Free Gifts To Orphans On Christmas Festival, Hero Vijay Deverakonda, Vijay Deverakonda, Vijay Deverakonda As Santa, Vijay Deverakonda As Santa Gifts, Vijay Deverakonda Latest News, Vijay Deverakonda Movies, Vijay Deverakonda Next Project, Vijay Dever
సినిమా వార్తలు

"దేవర - శాంటా "

సూపర్ హిట్ "పెళ్ళిచూపులు "మూవీ తో హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. "గీత గోవిందం " , "టాక్సీవాలా "వంటి సూపర్ హిట్ మూవీస్ తో అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ స్వంతం చేసుకున్నారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "లో నటిస్తున్నారు. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అన్నయ్యతో మల్టీ స్టారర్ అప్పుడు చూద్దాం

దొరసాని సినిమా తర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ చేస్తున్న రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. వినోద్ అనంతోజు దర్శకత్వంలో వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈరోజు అమెజాన్ లో రిలీజ్ అయింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ లో వెనిగ‌ళ్ళ ఆనంద‌ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మంచి కామెడీ ఎంటర్ టైనర్ అని.. చాలా నేచురల్ గా తెరకెక్కించారన్న ప్రశంసలు అందుకుంటున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘ఆకాశం నీ హద్దురా' పై విజయ్ ప్రశంసలు - సుధా గారు మీతో వర్క్ చేస్తా

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటివరకు డైరెక్ట్ గా విడుదలైన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో హిట్టవ్వలేదు. lచాలా సినిమాల త‌ర్వాత సూర్య మంచి విజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. నటనపరంగా సూర్యకు, డైరెక్టర్.గా సుధా కొంగరకు వందకు వంద మార్కులు పడ్డాయి. మోస్ట్ ఎమోషనల్ ఎటాచబుల్ స్టోరీగా అందరి మనసుల్నీ హత్తుకుంది.

TFN Adminవాట్సాప్
Actor Vijay Deverakonda Enjoys Cloud 9 Moment.
సినిమా వార్తలు

హ్యాపీ మూడ్ లో విజయ్ దేవరకొండ

"పెళ్ళిచూపులు ", "అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం ", "టాక్సీవాలా " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా రాణిస్తున్నారు. తమ క్రేజీ హీరో నటించిన మూవీస్ కై ఆసక్తి తో ఎదురు చూసే అభిమాన గణం ఎక్కువే. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "ఫైటర్ " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భారీ వర్షాలపై విజయ్ దేవరకొండ స్పందన

గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. జన జీవనం అస్తవ్యస్త మైంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వందకు పైగా కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి . ఇళ్ళు కూలిపోయి , వాహనాలు కొట్టుకుపోయి , నిత్యావసరాలు తడిచిపోయి ప్రజలు తిండి , నిద్ర లేక అలమటిస్తున్నారు. వాగులు , వంకలు పొంగి , చెరువు కట్టలు తెగి తెలంగాణలో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. నాలాలు పొంగి పొర్లాయి. మూసీ నది విశ్వరూపం దాల్చింది. పోలీసుల సాయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు జిహెచ్ఎంసి తరలిస్తోంది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సిక్స్ ప్యాక్ తో విజయ్ దేవరకొండ ?

"అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా రాణిస్తున్నారు. క్రేజీ హీరో విజయ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ "ఫైటర్" లో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో క్యారెక్టర్ కై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన "ఫైటర్ " మూవీ షూటింగ్ త్వరలో హైదరాబాద్ లో పునః ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బెస్ట్ ప్లేస్ యూరోప్ - విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో విజయ్ దేవరకొండ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ తో విజయ్ యూత్ లో క్రేజీ హీరోగా మారారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ " మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న "ఫైటర్" మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

"నువ్విలా ", "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ", "ఎవడే సుబ్రమణ్యం " వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ హీరోగా మారి "పెళ్ళిచూపులు " మూవీ తో ఘనవిజయం సాధించారు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ మూవీ కి విజయ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అర్జున్ రెడ్డి " మూవీతో విజయ్ యూత్ లో యెనలేని క్రేజ్ పెంపొందించుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సుక్కూ - విజయ్ క్రేజీ కాంబినేషన్ కన్ఫామ్

టాలీవుడ్ లో సూపర్ కాంబినేషన్స్ అన్నీ లైన్ కడుతున్నాయి. బన్నీ-కొరటాల, మహేష్-పరుశురాం ఇంకా చాలా ప్రెష్ కాంబినేషన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి. అయితే కరోనా వల్ల అసలే ఉన్న సినిమాలకు షూటింగ్ లు లేట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ధైర్యం చేసి షూటింగ్స్ ను మొదలుపెట్టి షూటింగ్ వరకూ పూర్తి చేసుకుంటున్నారు కానీ.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం క్లారిటీ లేదు ఎవరికీ.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తల్లికి విజయ్ ప్రామిస్ - ఎప్పుడూ సంతోషంగా ఉంచుతా

అతి తక్కువ కాలంలో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా ఎదిగాడు. భయపడకుండా తను మాట్లాడే మాటలు.. చేతలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకుని యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ మాస్ లుక్

సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ అధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీతో విజయ్ యెనలేని క్రేజ్ పెంపొందించుకున్నారు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ ను అభిమానించే వారు ఎక్కువయ్యారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ )మూవీ లో నటిస్తున్నారు. ఫైటర్ గా నటిస్తున్న విజయ్ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త లుక్‌లో విజయ్ దేవరకొండ?

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ త్వరలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. 'ఇస్మార్ట్' డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. లాక్‌డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నా కోసం స్క్రిప్ట్ రెడీ చెయ్.. అప్పటి వరకూ ఆగలేను..!

విజయ్ దేవరకొండ సినీ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే అర్జున్ రెడ్డి కి ముందు, అర్జున్ రెడ్డి కి తర్వాత...అని చెప్పొచ్చు. ఎందుకంటే అర్జున్ రెడ్డి కంటే ముందు విజయ్ పలు సినిమాల్లో నటించాడు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో ఏదో కనిపించి కనిపించని పాత్రలో కనపడి.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ కొట్టి హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిందే 'అర్జున్ రెడ్డి'.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఛాలెంజ్ పూర్తి చేయలేను...అమ్మ తిడుతోంది..!

ప్రస్తుతం టాలీవుడ్ లో 'బి ది రియల్ మ్యాన్' ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో పలు స్టార్ హీరోలు పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేశారు. చిరంజీవి నుండి వెంకటేష్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్స్ మరియు రాజమౌళి, కొరటాల శివ లాంటి డైరెక్టర్స్ ఈ ఛాలెంజ్ పూర్తి చేసి, రియల్ మెన్ అనిపించుకున్నారు. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం ఛాలెంజ్ ను పూర్తి చేయలేనని చెపుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ న్యూ మూవీ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) లో నటిస్తున్న విషయం తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న విజయ్ ఈ మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. విజయ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
తెలంగాణ పోలీసులను ప్రశంసించిన విజయ్ దేవరకొండ..!
సినిమా వార్తలు

తెలంగాణ పోలీసులను ప్రశంసించిన విజయ్ దేవరకొండ..!

వరుస పెట్టి అందరూ పోలీసులపై ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు పోలీసులను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మహేష్ బాబు తో మొదలైన ఈ ప్రశంసల పరంపర కొనసాగుతూనే ఉంది. మహేష్ బాబు, తర్వాత చిరు.. ఆ తర్వాత వెంకీ.. ఇప్పుడు యంగ్ అండ్ రౌడీ హీరో విజయ్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. అయితే విజయ్ మాత్రం డైరెక్ట్ గా తెలంగాణ పోలీస్‌ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించి.. పోలీసులను ప్రశంసించాడు. పోలీసులు రియ‌ల్ హీరోస్ అంటూ.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారని విజయ్‌ ప్రశంసించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ పోలీసులకు…

TFN Adminవాట్సాప్

షేర్