
ట్యాగ్ · 20 కథనాలు


మా ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా లేదు

నాని ఎక్కడ చూసినా నువ్వే
జపాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

పొన్నియన్ సెల్వన్ మణిరత్నం గారి 40 ఏళ్ల కల

సర్దార్ ఫస్ట్ సింగిల్, టీజర్ అప్ డేట్

రోలెక్స్ వర్సెస్ ఢిల్లీ.. కార్తి క్లారిటీ..!

త్వరలో సెట్స్ పైకి "ఖైదీ " సీక్వెల్ "ఖైదీ 2 "

కార్తీ కి హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ కూతురు

'ఖైదీ' సీక్వెల్ తప్పకుండా ఉంటుంది

"సుల్తాన్" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక

ఫుడ్ పై రష్మిక కామెంట్స్
'సుల్తాన్' టీజర్ రిలీజ్

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న హీరో కార్తీ
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తాజాగా ఆయన నటించిన ‘సత్యం సుందరం' చిత్రం విడుదలై థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కార్తీ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. ఆయనతో పాటు ఈ సినిమా దర్శకుడు '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ కూడా ఉన్నారు.

మా ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా లేదు
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

కార్తి సర్దార్ 2లో హీరోయిన్‌గా మరో స్టార్ యాక్ట్రెస్
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన 'సర్దార్' సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం 'సర్దార్ 2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్‌గా నిర్మిస్తోంది. ప్రముఖ దర్శక,నటుడు ఎస్.జె. సూర్య ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.

నాని ఎక్కడ చూసినా నువ్వే
ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తున్న దసరా సినిమా ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాలో మొదటి సారి నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తుండటంతో సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. నాని కెరీర్ లో మొదటిసారిగా వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా అదే రేంజ్ లో చేస్తున్నాడు. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా నాని చాలా జోరుగా పాల్గొంటున్నాడు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచగా.. రీసెంట్‌గా…
జపాన్ ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇకఅప్పుడే తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టైటిల్ కి తగ్గట్టే ఫస్ట్ లుక్ చాలా క్రేజీ గా వుంది. ఫస్ట్ లుక్ లో కార్తీ చేతిలో బాటిల్ పట్టుకొని, రెడ్ జంప్‌సూట్‌లో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించారు. కార్తీ ఎదురుగా మందు గ్లాస్ తో సేదతీరున్న ఓ అమ్మాయి కూడా గమనించవచ్చు. ఇక సోఫా వెనుక గోడపై పెద్ద గోల్డెన్…

పొన్నియన్ సెల్వన్ మణిరత్నం గారి 40 ఏళ్ల కల
స్టార్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు అన్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల ముందు అనుకున్న ఈసినిమా కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్లు పట్టింది. దీంతో ఈసినిమాపై భారీ అంచనలే ఉన్నాయి. రెండు భాగాలుగా రిలీజ్ కాబోతున్న ఈసినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఈనెల 30వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. దానికి ఇంకా చాలా తక్కువ రోజులే ఉండటంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. ఇక ఈ సినిమాను ఎంత భారీ బడ్జెట్ తో అయితే చిత్రీకరించారో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అంతే గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే హైదరాబాదులో…

సర్దార్ ఫస్ట్ సింగిల్, టీజర్ అప్ డేట్
తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ స్టార్ హీరో కార్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలతో ఇక్కడ కూడా ఎంతోమంది తెలుగు అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. దానికి కారణం ఆయన చేసే సినిమాలు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలను చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు కార్తి. అందుకే వరుస హిట్లను అందిపుచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే ముత్తయ్య దర్శకత్వంలో వచ్చిన విరుమన్ సినిమా సూపర్ హిట్ అయి తమిళనాట మంచి వసూళ్లను కూడా అందించింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సర్దార్ సినిమా కూడా ఒకటి.

రోలెక్స్ వర్సెస్ ఢిల్లీ.. కార్తి క్లారిటీ..!
తమిళ్ స్టార్ హీరో కార్తి కూడా ప్రస్తుతం డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం తను నటిస్తున్న విరుమన్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్ట్ 12న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తిని విక్రమ్ సినిమా లో తన పాత్ర అలానే తన అన్న రోలెక్స్ పాత్ర గురించి అడుగగా దానికి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

భారీ సాంగ్ తో "పొన్నియిన్ సెల్వన్ 1"
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయంరవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

'పొన్నియన్ సెల్వన్' కార్తీ ఫస్ట్ లుక్ రిలీజ్
మణిరత్నం సినిమాలు అంటే భావోద్వేగమైన ప్రేమకథ, ఎమోషన్స్ నిండి ఉంటాయి. తన సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి మణిరత్నం ఈసారి ఓ పీరియాడిక్ కథతో రాబోతున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఇంకా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తుండగా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి విక్రమ్ కు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమాలో…

త్వరలో సెట్స్ పైకి "ఖైదీ " సీక్వెల్ "ఖైదీ 2 "
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ , వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "ఖైదీ"తమిళ మూవీ 2019 అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "ఖైదీ " శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పణ లో తెలుగు రాష్ట్రాలలో అదే రోజున రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "ఖైదీ " మూవీ లో హీరో కార్తీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కార్తీ కి హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ కూతురు
తమిళ్ స్టార్ హీరో కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈసినిమా టైటిల్ ను తాజాగా ప్రకటించగా... విరుమన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. దీనితో పాటు ఈసినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు సూర్య. ఆసక్తికరమైన విషయం ఏంటంటేఇక ఈసినిమాలో హీరోయిన్ గా నటించేది ఎవరంటే డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితీ శంకర్. అదితీ శంకర్ హీరోయిన్ గా ఈసినిమాతో అరంగేట్రం చేయనుంది.

'ఖైదీ' సీక్వెల్ తప్పకుండా ఉంటుంది
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. హీరోయిన్ .. రొమాంటిక్ పాటలు .. కామెడీ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

కార్తీ "సర్దార్ " ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ సూపర్ హిట్ "పరుత్తివీరన్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కార్తీ ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "పరుత్తివీరన్ "మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్"మల్లిగాడు "మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కార్తీ హీరోగా రూపొందిన పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. హీరో కార్తీ కి తమిళ ఫ్యాన్స్ తో పాటు తెలుగు లో కూడా ఫ్యాన్స్ అధికమే.

"సుల్తాన్" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక
తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక ప్రస్తుతం “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

ఫుడ్ పై రష్మిక కామెంట్స్
బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. "మిషన్ మజ్ను "మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక మరో బాలీవుడ్ మూవీ "గుడ్ బాయ్ "కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రష్మిక ప్రస్తుతం "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "ఆడాళ్ళూ మీకు జోహార్లు "మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.
'సుల్తాన్' టీజర్ రిలీజ్
‘ఖైదీ’ అనే మంచి థ్రిల్లర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో కార్తి.. ఇప్పుడు ‘సుల్తాన్’ అనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. రెమో ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా 'సుల్తాన్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది .
'సుల్తాన్' సినిమాపై రష్మిక ఎమోషన్ - నమ్మలేనట్టుగా ఉంది
రెమో ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా 'సుల్తాన్'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కార్తి చాలా స్టైలిష్‌గా, యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన చేతిలో కొరడా కూడా ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంటోంది.
కార్తీ "సుల్తాన్ "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ స్టార్ హీరో సూర్య సోదరుడు గా కార్తీ కోలీవుడ్ కు పరిచయం అయినా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తమిళ భాషతో పాటు తెలుగు భాషలోకూడా హీరో కార్తీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విభిన్న కథా చిత్రాలలో నటిస్తూ హీరో కార్తీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరో కార్తీ నటించిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి రీసెంట్ గా బ్లాక్ బస్టర్ "ఖైదీ " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో కార్తీ తమిళ , తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నవిషయం తెలిసిందే.
కార్తీ 'సుల్తాన్' ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మొదటి నుండీ కాస్త విభిన్నంగానే సినిమాలు చేస్తుంటాడు. ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు. అదే 'సుల్తాన్'.. రెమో ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ, రష్మిక హీరో హీరోయిన్స్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా.. డేట్, టైమ్‌ని తెలుపుతూ.. చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను అక్టోబర్ 26 ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ఈ పోస్టర్‌లో తెలిపారు.