నాని ఎక్కడ చూసినా నువ్వే

Star Hero Karthi About Nani Dasara Movie

ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తున్న దసరా సినిమా ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాలో మొదటి సారి నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తుండటంతో సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. నాని కెరీర్ లో మొదటిసారిగా వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా అదే రేంజ్ లో చేస్తున్నాడు. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా నాని చాలా జోరుగా పాల్గొంటున్నాడు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచగా.. రీసెంట్‌గా రీలిజ్ అయిన ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. కంప్లీట్ మాస్ మేకోవర్, తెలంగాణ స్లాంగ్, యాటిట్యూడ్, మేనరిజమ్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా గురించి నాని గురించి తన సోషల్ మీడియాలో స్పెషల్ గా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు నాని.. నిన్ను ఇలా ఎనర్జిటిక్ గా చూడడం ఆనందంగా ఉంది.. నీకు మరింత పవర్ తోడవ్వాలని కోరుకుంటున్నానని పోస్ట్ లో తెలిపాడు.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 16 =