‘పొన్నియన్ సెల్వన్’ కార్తీ ఫస్ట్ లుక్ రిలీజ్

Karthi First Look Poster Released From Ponniyin Selvan Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Karthi,Hero Karthi,Karthi Movies,Karthi latest Movie Updates,Karthi New movie Updates,Karthi Upcoming Movies,Karthi Ponniyin Selvan Movie,Ponniyin Selvan Movie,Ponniyin Selvan Tamil Movie, Karthi First Look Poster From Ponniyin Selvan Movie Released,Ponniyin Selvan Movie Poster,Ponniyin Selvan Movie Poster Released,Ponniyin Selvan Movie latest Poster Of karthi Released, karthi Upcoming Movies,karthi New Movie Updates,Karthi latest Movie Poster Released

మణిరత్నం సినిమాలు అంటే భావోద్వేగమైన ప్రేమకథ, ఎమోషన్స్ నిండి ఉంటాయి. తన సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి మణిరత్నం ఈసారి ఓ పీరియాడిక్ కథతో రాబోతున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఇంకా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తుండగా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి విక్రమ్ కు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమాలో మరో కీలక పాత్రలో కార్తీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. వందియాతేవన్ పాత్రలో కార్తీ కనిపించనున్నాడు. గుర్రం మీద స్వారీ చేస్తూ రిలీజ్ చేసిన ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నటీనటులు విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరణ్‌ నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =