తమిళ్ స్టార్ హీరో కార్తి కూడా ప్రస్తుతం డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం తను నటిస్తున్న విరుమన్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్ట్ 12న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తిని విక్రమ్ సినిమా లో తన పాత్ర అలానే తన అన్న రోలెక్స్ పాత్ర గురించి అడుగగా దానికి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విక్రమ్ సినిమా చేస్తున్నప్పుడు రోలెక్స్ పాత్ర కోసం సూర్యను అడిగినప్పుడు కమల్ హాసన్ గారు హీరో కాబట్టి.. ఆయన మీద ఉన్న గౌరవంతో తను ఒప్పుకున్నాడు. ఇక ‘ఖైదీ’ సినిమాలోని పాత్ర ‘విక్రమ్’ సినిమాలో కూడా నడుస్తున్నట్టుగా చూపిస్తానని అంటే , నేను కూడా అందుకు అంగీకరించాను. అలా చూపించడం వల్ల ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా సెకండ్ పార్ట్ లో మాత్రం రోలెక్స్ పాత్ర విషయంలో .. ఇటు ‘ఖైదీ’ సినిమాలోని డిల్లీ పాత్ర విషయంలో లోకేష్ మరింత కష్టపడవలసి ఉంటుంది. ఈ ట్రాక్స్ విషయంలో ఆయన ఎంతో కసరత్తు చేయవలసి ఉంటుంది. ఈ విషయంలో ఆయన ఏం మ్యాజిక్ చేయనున్నాడనేది చూడాలి” అంటూ చెప్పుకొచ్చాడు. చూద్దాం మరి సీక్వెల్ లో సూర్యను కార్తి ని లోకేష్ ఏలా చూపిస్తాడో మరి.
ఇంకా ఈసినిమాలో హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. రాజ్ కిరణ్, ప్రకాష్ రాజ్, సూరి పలు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఈనెలలోనే ప్రారంభించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: