కార్తీ “సుల్తాన్ “మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Actor Karthi Sulthan Movie First Look Is Out

తమిళ స్టార్ హీరో సూర్య సోదరుడు గా కార్తీ కోలీవుడ్ కు పరిచయం అయినా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తమిళ భాషతో పాటు తెలుగు భాషలోకూడా హీరో కార్తీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విభిన్న కథా చిత్రాలలో నటిస్తూ హీరో కార్తీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరో కార్తీ నటించిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి రీసెంట్ గా బ్లాక్ బస్టర్ “ఖైదీ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో కార్తీ తమిళ , తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నవిషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్ పై సూపర్ హిట్ “రెమో ” మూవీ ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ , రష్మిక జంటగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సుల్తాన్ “మూవీ రూపొందింది. పొన్నాంబళం , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. ఇప్పుడు “సుల్తాన్ “మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. మీరు చూపించే ప్రేమాభిమానాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తాయనీ , “సుల్తాన్ “ఫస్ట్ లుక్ పోస్టర్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా అంటూ కార్తీ ఆ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ రష్మిక “సుల్తాన్ ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 17 =